- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Stock Market: రెండు నెలల్లోనే మార్కెట్ల నుంచి రూ. లక్ష కోట్ల విదేశీ పెట్టుబడులు వెనక్కి

దిశ, బిజినెస్ బ్యూరో: డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా కొత్త ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో గత కొన్ని వారాలుగా భారత మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఫలితంగా అమెరికా డాలర్ బలపడుతుండటం, బాండ్ మార్కెట్లో రాబడులు పెరిగిన నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు సైతం మన మార్కెట్ల నుంచి పెద్ద ఎత్తున నిధులను వెనక్కి తీసుకెళ్తున్నారు. ఇటీవల దిగుమతులపై అమెరికా సుంకాలు విధించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో ఉద్రిక్తతలు పెరిగాయి. దీనివల్ల మన మార్కెట్లలోనూ ఈ నెలలో రెండు వారాల్లోనే రూ. 21,272 కోట్లను విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) ఉపసంహరించుకున్నారు. గత నెలలోనూ రూ. 78,027 కోట్ల నిధులను వెనక్కి తీసుకోవడంతో ఈ ఏడాది ప్రారంభం నుంచి ఎఫ్‌పీఐల నిధుల ఉపసంహరణ దాదాపు రూ. లక్షల కోట్లకు చేరుకుంది. డిపాజిటరీ డేటా ప్రకారం, రెండు నెలల్లో ఎఫ్‌పీఐలు వెనక్కి తీసుకున్న నిధులు రూ. 99,299 కోట్లుగా ఉన్నాయి. డాలర్ ఇండెక్స్ బలహీనపడే వరకు ఎఫ్‌పీఐల అమ్మకాలు కొనసాగుతాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వి కె విజయకుమార్ అభిప్రాయపడ్డారు. యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై కొత్త సుంకాలు విధించడంతో పాటు పలు దేశాలపై పరస్పర సుంకాలు ఉంటాయని స్పష్టం చేశారు. అందువల్లే మార్కెట్లలో ఆందోళనలు పెరిగాయని నిపుణులు తెలిపారు. ఈ పరిణామాలు ప్రపంచ వాణిజ్య యుద్ధానికి దారితీస్తున్నాయని, దానివల్ల భారత్ సహా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లపై ఎక్కువ ప్రభావితం చేస్తున్నాయని పేర్కొన్నారు.