- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భారత్‌లో పెట్టుబడులకు విదేశీ ఇన్వెస్టర్ల క్యూ
దిశ, బిజినెస్ బ్యూరో: భారత స్టాక్ మార్కెట్లలో మరోసారి విదేశీ ఇన్వెస్టర్ల ఆసక్తి పెరిగింది. ఇటీవల విడుదలైన దేశ జీడీపీ వృద్ధి ఊహించిన దానికంటే ఎక్కువగా నమోదడం, మార్కెట్ల ర్యాలీ, అమెరికా బాండ్ల రాబడి తగ్గిపోతున్న నేపథ్యంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) ఈ నెలలో ఇప్పటివరకు రూ. 6,139 కోట్ల విలువైన భారత ఈక్విటీలను కొనుగోలు చేశారు. ఈ మేరకు డిపాజిటరీ గణాంకాలు వెల్లడించాయి. అంతకుముందు జనరిలో సైతం ఎఫ్‌పీఐలు రూ. 25,743 కోట్లు, ఫిబ్రవరిలో రూ. 1,539 కోట్ల పెట్టుబడులను ఈక్విటీల్లో పెట్టాయి. 'గత నెలతో పోలిస్తే మార్చిలో ఎఫ్‌పీఐల నిధులు భారీగా పెరిగాయి. వృద్ధితో పాటు దేశీయ దిగ్గజ కంపెనీల్లో కొనసాగుతున్న కొనుగోళ్లు కూడా విదేశీ నిధుల పెరుగుదలకు ప్రధాన కారణమని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వి కె విజయకుమార్ తెలిపారు.