FPIs: పుంజుకున్న విదేశీ మదుపర్ల పెట్టుబడులు.. డిసెంబర్ మొదటి వారంలో మార్కెట్లోకి రూ. 24,453 కోట్లు..!

by Maddikunta Saikiran |
FPIs: పుంజుకున్న విదేశీ మదుపర్ల పెట్టుబడులు.. డిసెంబర్ మొదటి వారంలో మార్కెట్లోకి రూ. 24,453 కోట్లు..!
X

దిశ,వెబ్‌డెస్క్: విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు(FPI) దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) నుంచి గత రెండు నెలలుగా నిధులు వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే చాలా రోజుల తర్వాత విదేశీ మదుపర్లు కొనుగోలుదారులుగా మారారు. డిసెంబర్ మొదటి వారంలో ఫారిన్ ఇన్వెస్టర్లు ఈక్విటీ షేర్ల(Equity Shares)లో ఏకంగా రూ. 24,453 కోట్ల పెట్టుబడులు పెట్టారు. అంతర్జాతీయంగా పరిస్థితులు స్థిరంగా(Constant) ఉండటం, అమెరికా ఫెడరల్ రిజర్వ్(America's Federal Reserve) వడ్డీ రేట్లను తగ్గించే అవకాశమున్న నేపథ్యంలో విదేశీ మదుపర్లు మన మార్కెట్లలో తిరిగి పెట్టుబడులు పెడుతున్నారు. కాగా నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్(NSDL) గణాంకాల ప్రకారం గత నెల(నవంబర్)లో ఫారిన్ ఇన్వెస్టర్లు ఏకంగా రూ.21,612 కోట్ల విలువైన పెట్టుబడులను కోట్ల బ్యాక్ తీసుకున్నారు. కాగా సెప్టెంబర్‌లో విదేశీ ఇన్వెస్టర్లు రూ.57,724 కోట్లతో పెట్టుబడులు పెట్టగా.. అక్టోబర్లో మాత్రం రూ. 94,017 కోట్ల పెట్టుబడులను మార్కెట్ నుంచి వెనక్కి తీసుకున్నారు. భవిష్యత్ లో ఎఫ్ఐఐల పెట్టుబడులు మరింత పుంజుకునే అవకాశముందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Next Story

Most Viewed