- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Swiggy : మరో రౌండ్ లేఆఫ్స్‌కు సిద్ధమైన స్విగ్గీ
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఫుడ్ డెలివరీ స్టార్టప్ స్విగ్గీ ఐపీఓకు ముందు ఆర్థిక ఇబ్బందులను అధిగమించే ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా తన వర్క్‌ఫోర్స్‌లో 7 శాతం మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు తెలుస్తోంది. ఈ నిర్ణయం దాదాపు 400 మంది ఉద్యోగులపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా కొత్త లేఆఫ్స్ టెక్, ఆపరేషన్స్ విభాగాల్లో ఉండొచ్చని అంచనా. దీంతో ఇప్పటికే ఈ ఏడాదికి కొత్తగా లేఆఫ్స్ ప్రకటించిన కంపెనీల జాబితాలో స్విగ్గీ కూడా చేరింది. గతేడాది జనవరిలో సైతం కంపెనీ 380 మంది ఉద్యోగులను తొలగించింది. ఖర్చులను తగ్గించే కారణంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇక, ఈ ఏడాది స్విగ్గీ పబ్లిక్ ఇష్యూ ద్వారా 1 బిలియన్ డాలర్ల వరకు సేకరించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే కోటక్ మహీంద్రా కేపిటల్, సిటీ, జేపీ మోర్గాన్, బోఫా సెక్యూరిటీస్, జెఫరీస్ లాంటి ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులను ఐపీఓ ప్రక్రియ కోసం ఎంచుకుంది.