SBI నుండి కొత్త కెడ్రిట్ కార్డ్.. ప్రతి ఆన్ లైన్ లావాదేవీపై క్యాష్ బ్యాక్

by Satheesh |   ( Updated:2022-09-03 12:05:43.0  )
SBI నుండి కొత్త కెడ్రిట్ కార్డ్.. ప్రతి ఆన్ లైన్ లావాదేవీపై క్యాష్ బ్యాక్
X

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశపు అతిపెద్ద ప్యూర్ ప్లే క్రెడిట్ కార్డు జారీ చేసే ఎస్‌బీఐ కార్డ్, భారతదేశంలో మొట్టమొదటి, అత్యంత సమగ్రమైన క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డు అయిన 'క్యాష్ బ్యాక్ ఎస్‌బీఐ కార్డ్'ను ఈ రోజు విడుదల చేసింది. క్యాష్ బ్యాక్ ఎస్‌బీఐ కార్డు అనేది పరిశ్రమలో మొట్టమొదటి క్యాష్ బ్యాక్ లక్ష్యిత క్రెడిట్ కార్డు, ఇది కార్డుదారులు ఎలాంటి మర్చంట్ పరిమితులు లేకుండా అన్ని ఆన్ లైన్ ఖర్చులపై 5% క్యాష్ బ్యాక్ పొందడానికి దోహదపడుతుంది. మాస్ నుంచి ప్రీమియం వరకు అన్ని కేటగిరీల్లోని కస్టమర్‌లను లక్ష్యంగా చేసుకున్న ఈ కార్డు సరళమైన, అంతరాయం లేని, పూర్తిగా డిజిటల్ జాయినింగ్ అనుభవాన్ని అందిస్తుంది. టైర్ 2, 3 నగరాలతో సహా భారతదేశం అంతటా ఉన్న వినియోగదారులు, డిజిటల్ అప్లికేషన్ ఫ్లాట్‌ఫామ్ 'ఎస్‌బీఐ కార్డు స్ప్రింట్' ద్వారా కేవలం కొన్ని క్లిక్ లలో తమ ఇళ్ల నుంచే తక్షణమే క్యాష్ బ్యాక్ ఎస్‌బీఐ కార్డును సులభంగా పొందవచ్చు.

కాంటాక్టు అవసరంలేని కార్డు మొదటి సంవత్సరం మార్చి 2023 వరకు ప్రత్యేక ఆఫరుగా ఉచితం. బలమైన ప్రపోజిషన్ కారణంగా, క్యాష్ బ్యాక్ ఎస్‌బీఐ కార్డు కస్టమర్ అన్ని ఖర్చులపై అపరిమితమైన 1% క్యాష్ బ్యాక్ ని పొందుతాడు, నెలవారీ స్టేట్ మెంట్ సైకిల్‌కు గరిష్టంగా రూ. 10,000 వరకు అన్ని ఆన్ లైన్ ఖర్చులపై క్యాష్ బ్యాక్ 5%కు పెరుగుతుంది. మర్చంటుతో సంబంధం లేని దీని స్వభావం కస్టమర్ లు బెనిఫిట్‌లను పొందడం కోసం కేవలం కొంతమంది వ్యాపారులతోనే షాపింగ్‌కు పరిమితం కాకుండా చూస్తుంది. క్యాష్ బ్యాక్ ఎస్‌బీఐ కార్డు క్యాష్ బ్యాక్ సదుపాయం ఆటో క్రెడిట్‌తో వస్తుంది, ఇది స్టేట్ మెంట్ జనరేట్ చేసిన రెండు రోజుల్లోగా ఎస్‌బీఐ కార్డు ఖాతాకు క్యాష్ బ్యాక్ అనే టైటిల్ కలిగిన క్యాష్ బ్యాక్ ఆటోమేటిక్ క్రెడిట్‌‌ని అనుమతిస్తుంది.

ఎస్‌బీఐ కార్డ్ ఎండీ, సీఈఓ శ్రీ. రామమోహన రావు అమరా మాట్లాడుతూ, "క్యాష్ బ్యాక్ ఎస్‌బీఐ కార్డ్ మా కోర్ కార్డ్ పోర్ట్ ఫోలియోను మరింత బలోపేతం చేస్తుంది. కస్టమర్‌ల పెరుగుతున్న అవసరాలను తీర్చడం కోసం మా నిరంతర ప్రయత్నాలకు ఈ ప్రొడక్ట్ ఒక చక్కటి ఉదాహరణ. మా విభిన్న ప్రయత్నాల సమయంలో, ఆన్ లైన్ షాపింగ్, క్యాష్ బ్యాక్‌ల పట్ల కార్డుదారుల అనుబంధాన్ని మేం గుర్తించాం. దీనికి అనుగుణంగా, ప్రతి కొనుగోలుపై, ప్రతిసారీ ప్రతిచోటా క్యాష్ బ్యాక్ బెనిఫిట్‌లను పొందడానికి కస్టమర్లకు నిజంగా సాధికారత కల్పించే క్యాష్ బ్యాక్ ఎస్‌బీఐ కార్డును మేం ఆలోచనాత్మకంగా డిజైన్ చేశాం. ఈ ప్రత్యేకమైన కార్డును లాంఛ్ చేయడం కూడా సరైన సమయంలో జరుగుతోంది, ఎందుకంటే కస్టమర్లు ప్రతిరోజూ దాని శక్తిని అనుభవించవచ్చు రాబోయే పండుగ సీజన్‌లో దీనిని ఎక్కువగా ఉపయోగించుకోవచ్చు'' అని అన్నారు.

క్యాష్ బ్యాక్ ఎస్‌బీఐ కార్డు ద్వారా అందించబడే ప్రయోజనాలు దాని బలమైన క్యాష్ బ్యాక్ ఫీచర్లకు మించి ఉంటాయి. కార్డుదారులు సంవత్సరానికి నాలుగు కాంప్లిమెంటరీ దేశీయ విమానాశ్రయ లాంజ్ సందర్శనలను పొందవచ్చు (త్రైమాసికానికి ఒక సందర్శన). రూ.500 నుంచి రూ.3,000 వరకు లావాదేవీ మొత్తానికి చెల్లుబాటు అయ్యే 1% ఫ్యూయల్ సర్ఛార్జ్ మినహాయింపును కూడా ఈ కార్డు అందిస్తుంది. ప్రతి క్రెడిట్ కార్డు ఖాతాకు ప్రతి బిల్లింగ్ స్టేట్ మెంట్‌కు గరిష్ట సర్ ఛార్జీ మినహాయింపు పరిమితి నెలకు రూ.100. కార్డు వార్షిక పునరుద్ధరణ రుసుము రూ .999తోపాటు వర్తించే పన్నులు ఉంటాయి. క్యాష్ బ్యాక్ ఎస్‌బీఐ కార్డు వినియోగదారులు కార్డు సభ్యత్వ సంవత్సరంలో రూ .2 లక్షల వార్షిక ఖర్చుల మైలురాయిని చేరుకున్న తరువాత రెన్యువల్ ఫీజు రివర్సల్‌ను ఆస్వాదించవచ్చు. క్యాష్ బ్యాక్ ఎస్‌బిఐ కార్డు వీసా ప్లాట్ ఫామ్‌పై లభ్యం అవుతుంది.

Advertisement

Next Story

Most Viewed