గూగుల్ మ్యాప్ ద్వారా EV చార్జింగ్ పాయింట్లు

by Harish |   ( Updated:2023-02-09 17:18:55.0  )
గూగుల్ మ్యాప్ ద్వారా EV చార్జింగ్ పాయింట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వాడకం భారీగా పెరుగుతుంది. అయితే వీటి వాడకంలో ప్రధానంగా వాహనాదారులకు చార్జింగ్ సమస్య ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో సెర్చింజన్ సంస్థ గూగుల్ సరికొత్త ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. Google మ్యాప్స్‌లో లేటెస్ట్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా ఎలక్ట్రిక్ వాహనాదారులు చార్జింగ్ పాయింట్లు ఎక్కడ ఉన్నాయో గూగుల్ మ్యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. దీంతో చార్జింగ్ స్టేషన్లను వెతుక్కోవాల్సిన బాధ తప్పుతుంది. ప్రస్తుత ట్రాఫిక్, చార్జింగ్ లెవల్, దూరం ఆధారంగా మ్యాప్స్ అనుకూలమైన చార్జింగ్ పాయింట్లను చూపిస్తుంది.

ముఖ్యంగా చార్జింగ్ ఫిల్టర్ 150 కిలోవాట్‌లు లేదా అంతకంటే ఎక్కువ చార్జర్‌లను కలిగి ఉన్న స్టేషన్‌లను సులభంగా కనుగొనడంలో ఉపయోగపడుతుంది. సూపర్ మార్కెట్ వంటి ప్రదేశాలలో ఆన్-సైట్ చార్జింగ్ స్టేషన్లు ఎక్కడ ఉన్నా కూడా మ్యాప్ ద్వారా లొకేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ సదుపాయం లండన్, లాస్ ఏంజిల్స్, న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో, టోక్యోలలో ప్రారంభించబడింది. అతి త్వరలో భారత్‌తో పాటు ఇతర ప్రధాన నగరాల్లో అందుబాటులోకి రానుంది.

Advertisement

Next Story

Most Viewed