- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Jewellary: జనవరిలో 7 శాతం తగ్గిన రత్నాభరణాల ఎగుమతులు

దిశ, బిజినెస్ బ్యూరో: గత నెలలో రత్నాభరణాల ఎగుమతులు 7.01 శాతం తగ్గి రూ. 19.36 వేల కోట్లకు చేరుకున్నాయని జెం అండ్ జ్యువెలరీ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్(జీజేఈపీసీ) డేటా వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలకు సంబంధించిన ప్రకటనలతో అంతర్జాతీయంగా రత్నాభరణాల మార్కెట్లో ఆర్థిక అనిశ్చితి నెలకొందని, అందుకే ఎగుమతులు తగ్గుముఖం పట్టాయని జీజేఈపీసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇదే సమయంలో దిగుమతులు రూ. 12.33 వేల కోట్లుగా ఉన్నాయి. ఇది గతేడాది జనవరితో పోలిస్తే 37.83 శాతం క్షీణించాయి. పెళ్లిళ్ల సీజన్ ముగింపునకు రావడం, డిమాండ్ నెమ్మదించడం కూడా ప్రభావం చూపిందని జీజేఈపీసీ అభిప్రాయపడింది. మరోవైపు, జనవరి నెలలో ఒక్క బంగారం దిగుమతుల విలువే రూ. 23 వేల కోట్లుగా నమోదయ్యాయని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ శొమవారం ప్రకటనలో వెల్లడించింది. ఇది గతేడాదితో పోలిస్తే 40.9 శాతం ఎక్కువ కావడం విశేషం. దేశంలో పసిడి ధరలు కొత్త రికార్డు గరిష్ఠాలకు చేరుతున్నప్పటికీ బంగారం డిమాండ్ తగ్గకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-జనవరి మధ్య బంగారం దిగుమతులు 50 బిలియన్ డాలర్ల(రూ. 4.34 లక్షల కోట్ల) మార్కును చేరినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. భౌగోళిక రాజకీయ పరిణామాలు, ఇతర అంశాల కారణంగా ఎక్కువమంది బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడి సాధనంగా చూస్తున్నారని, అందువల్లే దిగుమతులు పెరిగాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగా, సోమవారం హైదరాబాద్‌లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన పది గ్రాములు రూ. 86,620 ఉండగా, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల పసిడి పది గ్రాములు రూ. 79,400గా ఉంది. వెండి కిలో రూ. 1,08,000 ఉంది.