EPFO: ఉద్యోగస్తులకు కేంద్రం షాక్.. EPFO పెన్షన్‌లో భారీ కోత!

by Vennela |
EPFO: ఉద్యోగస్తులకు కేంద్రం షాక్.. EPFO పెన్షన్‌లో భారీ కోత!
X

దిశ, వెబ్ డెస్క్: EPFO: ఈపీఎఫ్ఓ(EPFO) చందాదారులకు బిగ్ అలర్ట్. అధిక పెన్షన్ లెక్కింపు విధానం గురించి ఎప్పటినుంచో ఎన్నో సందేహాలు ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు దీని గురించి ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది. అయితే కొత్త నిర్ణయం నేపథ్యంలో ఇది సబ్ స్క్రైబర్స్ ఆశలపై నీళ్లు చల్లింది. కొత్త లెక్కలను బట్టి చూస్తే..వచ్చే పెన్షన్ లో పెద్ద మొత్తంలో కోత పడుతుంది. అధిక పింఛన్(High pension) అర్హత లేని..ఈపీఎఫ్ఓ పెన్షనర్ల(EPFO pensioners)కు వర్తింపజేస్తున్నటువంటి లెక్కింపు విధానాన్నే..ఇప్పుడు అధిక పింఛన్ అర్హుల(High pension entitlements)కు అమలు చేస్తామని తెలిపింది. ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ నిబంధనల ప్రకారం..2014 సెప్టెంబర్ కంటే ముందు సర్వీసుకు పార్ట్ 1 సెప్టెంబర్ తర్వాత రిటైర్మెంట్(Retirement) వరకు పార్ట్ 2 కింద లెక్కించి తుది పెన్షన్ ఖరారు చేయనుంది.

కార్మిక మంత్రిత్వ శాఖ(Ministry of Labor) కూడా ఈ విధానానికి ఆమోదం తెలిపినట్లు ఈపీఎఫ్ఓ(EPFO) తెలిపింది. ఈ మేరకు ఈపీఎఫ్ఓ హైయ్యర్ పెన్షన్(EPFO Higher Pension) విభాగం అదనపు కేంద్ర భవిష్యనిధి కమిషనర్ చంద్రమౌళి చక్రవర్తి దీనిపై ఆదేశాలు జారీ చేశారు. పార్ట్ 1, పార్ట్ 2 కింద లెక్కించడంతో ఇప్పుడు 30శాతానికి పింఛనులో కోతపడుతుంది. గరిష్టవేతన పరిమితి రూ. 6,500 నుంచి 15వేలకు పెంచిన సమయంలో ఈపీఎఫ్ఓ(EPFO) ఈ నిబంధనను తీసుకువచ్చింది. 2014 సెప్టెంబర్ 1కి ముందు చివరి ఏడాది సగటు వేతనం(Average salary) మొత్తం సర్వీస్ కలిపి పెన్షన్ లెక్కించే విధానం అమల్లో ఉండేది. ఇక గరిష్ట వేతన పరిమితి పెంచిన తర్వాత ఆఖరి ఐదేళ్ల సగటు వేతనం తీసుకుని లెక్కించేలా సవరణలు చేసింది.

అయితే పెన్షన్ ఫండ్(Pension Fund) కు నగదు జమ చేస్తున్నప్పుడు గరిష్ట వేతన పరిమితి ప్రస్తావనలేదు. ఇలా పార్ట్ 1,2 అని కాకుండా 2014 సెప్టెంబర్ కు ముందున్న నిబంధనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు కార్మిక సంఘాలు. ఉదాహరణకు ప్రభుత్వ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగి..1999లో సర్వీసులో చేరి 2021లో రిటైర్ అయ్యారనుకుంటే..బోనస్ రెండేళ్లలో కలిపి మొత్తం సర్వీస్ కాలం 24ఏళ్లు అవుతుంది. ఇక 2014 వరకు సగటు వార్షిక వేతనం రూ. 22వేలు ఉంటే రిటైర్మెంట్(Retirement) సమయంలో చివరి ఐదేళ్ల సగటు వేతనం రూ. 40వేలు ఉంటుంది. ఈ లెక్కన చివరి 5ఏళ్ల వేతన సగటుతో పింఛన్ రూ. 13,714 అందాలి. అయితే పార్ట్ 1,2 కింద లెక్కించడంతో పార్ట్ 1 కింద రూ. 5342, పార్ట్ 2 కింద రూ. 4వేలు ఇలా మోత్తం రూ. 9342 మాత్రమే అవుతుంది. నెలకు దాదాపు రూ. 4372మేర కోత పడుతుంది. పింఛన్ లెక్కించేందుకు ఒక ఫార్మూలా ఉంది. వేతన సగటున సర్వీస్ కాలంతో గుణించి దానిని 70తో భాగించాలి. దీన్ని బట్టి పెన్షన్ లెక్కిస్తుంటారు.

Next Story

Most Viewed