- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒక వ్యక్తి ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ కలిగి ఉండొచ్చో తెలుసా..!?
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం చాలా మంది బ్యాంక్ అకౌంట్స్ కలిగి ఉన్నారు. కరెంట్, సేవింగ్స్ అని పలు రకాల బ్యాంక్ అకౌంట్స్‌ను ప్రజలు వాడుతున్నారు.కొందరు 3 నుండి 4 ఖాతాలు కలిగి ఉంటారు. అయితే గరిష్టంగా ఎన్ని బ్యాంకు ఖాతాలను తెరవగలం, ఎన్ని ఖాతాలను నిర్వహించవచ్చు అనే ప్రశ్న ప్రతి ఒక్కరికి వచ్చే ఉంటుంది. దీనికి ఏమైనా రూల్స్ ఉన్నాయా.. అని ఆలోచిస్తారు. అయితే భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం, ఒక వ్యక్తి ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ అయిన కలిగి ఉండవచ్చు. బ్యాంకు ఖాతాల సంఖ్యపై రిజర్వ్ బ్యాంక్ ఎలాంటి పరిమితిని నిర్ణయించలేదు. మీకు కావాల్సిన ఏ బ్యాంకుల్లో అయిన పరిమితి లేకుండా పొదుపు ఖాతాలను కలిగి ఉండవచ్చు.
కాకపోతే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే జీతం ఖాతా మినహా, పొదుపు ఖాతాలు ఎన్ని కలిగి ఉన్నా కూడా వాటిలో మినిమం బ్యాలెన్స్ మాత్రం తప్పనిసరిగా మెయింటనెన్స్ చేయాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి 10 పొదుపు ఖాతాలను కలిగి ఉంటే వాటిలో కచ్చితంగా మినిమం అమౌంట్ ఉండాల్సిందే, లేదంటే జరిమానా విధిస్తారు. అలాగే అన్ని అకౌంట్లకు సంబంధించిన మెసేజ్ చార్జీలు కూడా ఉంటాయి. అవన్ని భరించాల్సి వస్తుంది కాబట్టి, నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఒక వ్యక్తి 3 నుంచి 4 పొదుపు ఖాతాలను కలిగి ఉండటం మంచిది అని చెబుతున్నారు.