రూ. 8.21 లక్షల కోట్లకు మొబైల్‌ఫోన్‌ల ఎగుమతులు

by Harish |
రూ. 8.21 లక్షల కోట్లకు మొబైల్‌ఫోన్‌ల ఎగుమతులు
X

న్యూఢిల్లీ: వచ్చే ఐదేళ్ల కాలంలో మొబైల్‌ఫోన్ ఎగుమతులను రూ. 82 వేల కోట్ల నుంచి రూ. 8.21 లక్షల కోట్లకు పెరుగుతాయని ప్రముఖ డిక్సన్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, చైర్మన్ సునీల్ వచాని తెలిపారు. దేశీయ పరిశ్రమలో ఉన్న రూ. 9.85 లక్షల కోట్ల విలువైన డిమాండ్‌లో రూ. 7.40 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులు దేశీయంగానే తయారవుతున్నాయి. ప్రపంచ ఎలక్ట్రానిక్స్ తయారీకి సంబంధించి భారత్ ప్రత్యామ్నాయంగా మారే అవకాశాలు ఉన్నాయి. దీనికోసం భారత ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో నాణ్యమైన బ్రాండ్లను సృష్టించేందుకు డిజైన్-ఆధారిత తయారీ, ఎంఎస్ఎంఈ పెట్టుబడులు అవసరమని సునీల్ అన్నారు.

ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో డిజైన్-లీడ్ మాన్యుఫాక్చరింగ్ కోసం అభివృద్ధి జరగాలి. దీనివల్ల దేశీయ బ్రాండ్లు ఉనికిలోకి వస్తాయి. ఎంఎస్ఎంఈలు తప్పనిసరిగా ఎలక్ట్రానిక్ విభాగంలో వృద్ధి చెందాలి. తయారీని పెంచేందుకు డిజైన్ ఆధారిత తయారీ కీలకమని ఆయన వెల్లడించారు. గ్లోబల్ మార్కెట్లకు భారత్ ఒక తయారీ కేంద్రంగా మారేందుకు ఇది సరైన సమయమని భావిస్తున్నట్టు సునీల్ వచాని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed