- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
UPI చెల్లింపుల్లో భారీ పెరుగుదల.. ఆదరణ కోల్పోతున్న డెబిట్ కార్డులు!
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత కాలంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(UPI) ఆధారిత చెల్లింపులు ఎక్కువగా జరుగుతున్నాయి. వేగంగా మనీ ట్రాన్స్‌ఫర్ కావడం, ప్రాసెస్ కూడా ఈజీగా ఉండటం వలన ఈ తరహా లావాదేవీలపై ప్రజలు మొగ్గుచూపుతున్నారు. అయితే ఇదే సమయంలో డెబిట్ కార్డుల లావాదేవీలు మాత్రం భారీగా తగ్గుతున్నాయి. ఇటీవల ఆర్‌బీఐ పేర్కొన్న వివరాల ప్రకారం, ఆన్‌లైన్ ఈ కామర్స్ లావాదేవీలకు UPI చెల్లింపులు ఈజీగా ఉంటున్నాయి. అందుకే ప్రజలు డెబిట్ కార్డుల వినియోగాన్ని తగ్గించారు. ముఖ్యంగా చిన్న లావాదేవీలకు UPI బెస్ట్ ఆప్షన్‌గా ఉంది. అదే పెద్ద మొత్తంలో అయితే నెట్ బ్యాంకింగ్ వైపు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు.
గత ఏడాది ఏప్రిల్‌లో, రిజర్వ్ బ్యాంక్ ఈకామర్స్, ఆఫ్‌లైన్ మర్చంట్ స్వైప్‌లను విభజించడం ప్రారంభించింది. అప్పుడు ఈ కామర్స్‌లో డెబిట్ కార్డుల లావాదేవీల సంఖ్య 117 మిలియన్లుగా ఉండగా, 2023 సెప్టెంబర్ నెలలో ఈ లావాదేవీలు సగానికి పైగా తగ్గి 51 మిలియన్లుగా నమోదయ్యాయి. డెబిట్ కార్డు లావా దేవీల మొత్తం విలువ రూ.21,000 కోట్ల నుంచి రూ.16,127 కోట్లకు చేరుకుంది.
ఈకామర్స్ చెల్లింపులలో డెబిట్ కార్డ్‌ల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికి, ఇంకా ఈ సంఖ్య గణనీయంగానే ఉంది. ఆఫ్‌లైన్ స్టోర్‌లలో డెబిట్ కార్డ్ స్వైప్‌లు ఏప్రిల్ 2022లో 213 మిలియన్ల నుండి 132 మిలియన్లకు తగ్గాయి. అదే UPI చెల్లింపులు 2.2 బిలియన్ల నుంచి 6.1 బిలియన్లకు పెరిగింది. చిన్న మొత్తాల చెల్లింపులు షాపులు, టీస్టాల్స్, టిఫిన్ సెంటర్లు, కిరాణా షాపుల్లో మొదలగు వాటిలో UPI ద్వారా చెల్లింపులు ఎక్కువగా జరుగుతున్నాయి.
అదే క్రెడిట్ కార్డుల విషయానికి వస్తే 2022 ఏప్రిల్‌లో 107 మిలియన్లుగా ఉన్న క్రెడిట్ కార్డు లావాదేవీలు 2023 సెప్టెంబర్ నాటికి 22 శాతం పెరిగి 131 మిలియన్లకు పెరిగాయి. అదే విలువ పరంగా రూ.65,652 కోట్ల నుంచి రూ.92,878 కోట్లకు చేరింది. ప్రస్తుతం దేశంలో సుమారు 93 మిలియన్ క్రెడిట్ కార్డ్‌లు ఉన్నాయి. QR కోడ్, ఫోన్ నెంబర్లను ఉపయోగించి చెల్లింపులు చేయడానికి UPI ఈజీగా ఉండటం కారణంగా ఈ తరహా చెల్లింపులు భారీగా పుంజుకుంటున్నట్లు ఆర్‌బీఐ పేర్కొంది.