- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎంఎఫ్, డీమ్యాట్ ఖాతాదారుల నామినీ వివరాలకు గడువు పొడిగించిన సెబీ!
ముంబై: స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. మ్యూచువల్ ఫండ్(ఎంఎఫ్) పెట్టుబడిదారులతో పాటు స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులకు అవసరమైన డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాదారులకు నామినేషన్ వివరాలను పొందుపరిచేందుకు గడువు పొడిగిస్తున్నట్టు వెల్లడించింది. ఆయా ఖాతాదారులకు నామినీ వివరాలు ఇచ్చేందుకు ఈ ఏడాది మార్చి 31 వరకు ఉన్న గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడిదారులు తప్పనిసరిగా నామినీని ఎంచుకోవాలని గతంలో సెబీ నిబంధనలను తీసుకొచ్చింది. లేదా నామినీ అక్కరలేదని స్పష్టంగా తెలియజేయాల్సి ఉంటుంది. ఈ రెండు ప్రక్రియల్లో ఏది చేయకపోయినా ఆయా ఖాతాలు నిలిచిపోతాయని వెల్లడించింది. ఇప్పటికే నామినీ వివరాలను ఇచ్చినవారు మళ్లీ చేయాల్సిన అవసరం లేదు. డీమ్యాట్, ట్రేడింగ్ అకౌంట్లకు ఇదే నిబంధన వర్తిస్తుంది. గడువు ముగుస్తున్నప్పటికీ ఇంకా చాలామంది వివరాలను ఇవ్వకపోవడం వల్లనే గడువు పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు సెబీ పేర్కొంది.