ప్రస్తుత సవాళ్లు సూపర్ పవర్ కావాలనే భారత్ లక్ష్యాన్ని ప్రభావితం చేయలేవు: Anand Mahindra

by Harish |   ( Updated:2023-02-04 12:54:11.0  )
ప్రస్తుత సవాళ్లు సూపర్ పవర్ కావాలనే భారత్ లక్ష్యాన్ని ప్రభావితం చేయలేవు: Anand Mahindra
X

బెంగళూరు: అదానీ గ్రూప్‌పై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా పరోక్షంగా అదానీ గ్రూప్‌కు మద్ధతు అందించారు. భారత్ గతంలో ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొంది. భారత్‌ను ఎప్పుడు తక్కువగా అంచనా వేయవద్దు, సూపర్ పవర్ కావాలనే భారత్ లక్ష్యాన్ని ఇవి ఏమాత్రం ప్రభావితం చేయలేవు అని గ్లోబల్ మీడియాకు సూచించారు. ఈ విషయంపై సోషల్ మీడియా వేదిక ట్విట్టర్‌లో ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. 'ప్రపంచ ఆర్థిక శక్తిగా భారత్ ఎదగడానికి వ్యాపార రంగంలో ప్రస్తుతం ఉన్న సవాళ్లు అవకాశాలను దెబ్బతీస్తాయి అని గ్లోబల్ మీడియా ఊహిస్తోంది. మేము కరువులు, మాంద్యం, భూకంపాలు, తీవ్రవాద దాడులను తట్టుకున్నాం, నేను చెప్పేది ఒక్కటే భారతదేశానికి వ్యతిరేకంగా ఎప్పుడూ పందెం వేయవద్దు' అని పేర్కొన్నారు.

అదానీ గ్రూప్ మోసాలకు పాల్పడిందని వస్తున్న ఆరోపణల కారణంగా అదానీ షేర్లు గత కొంత కాలంగా భారీగా పడిపోతున్నాయి. ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగాలనుకుంటున్న భారత్‌కు ఇలాంటి ఉదంతాలు ఆటంకంగా ఉంటాయని గ్లోబల్ మీడియా భావిస్తున్న తరుణంలో ఆనంద్ మహీంద్రా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక కారణంగా అదానీ గ్రూప్ విలువ భారీగా క్షిణీస్తుంది. మర్కెట్లో లిస్ట్ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌తో సహా 10 కంపెనీల నుండి $110 బిలియన్లకు పైగా తుడిచిపెట్టుకుపోయింది. అలాగే, పార్లమెంట్ సమావేశాల్లో కూడా అదానీ కంపెనీలపై హిండెన్ బర్గ్ చేసిన ఆరోపణల గురించి చర్చ జరపాలని పలు పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి : ప్రపంచ కుబేరుడైన అదానీని గజగజ వణికిస్తున్న అంబులెన్స్ డ్రైవర్..

Advertisement

Next Story

Most Viewed