బైక్ ప్రియులకు క్రేజీ న్యూస్.. ఈ నెలలో మార్కెట్‌లో కొత్త బైకులు సందడి!

by D.Reddy |
బైక్ ప్రియులకు క్రేజీ న్యూస్.. ఈ నెలలో మార్కెట్‌లో కొత్త బైకులు సందడి!
X

దిశ, వెబ్ డెస్క్: బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్. అదిరిపోయే ఫీచర్లతో ఈ నెలలో టాప్ బ్రాండ్ల నుంచి సరికొత్త బైకులను విడుదల కానున్నాయి. మరీ వాటిపై ఓ లుక్కేద్దాం రండి.

* ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 650:

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైకులకు యూత్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనిని క్యాష్ చేసుకునేందుకు సరికొత్త ఫీచర్లు, డిజైన్‌తో క్లాసిక్‌ 650ను తీసుకురాబోతోంది. ఇది 350కు పోలిస్తే ప్రీమియం వెర్షన్‌. 647 సీసీ ఇంజిన్‌తో బ్లాక్‌ క్రోమ్‌, బ్లంటింగ్‌థోర్ప్‌ బ్లూ, వల్లమ్‌ రెడ్‌, టీల్‌ వంటి డ్యూయల్‌ టోన్‌ పెయింట్‌ స్కీమ్‌తో ఈ మోటార్‌ సైకిల్‌ రాబోతోంది. ఇక దీని ధర రూ.3,40,000 వరకు ఉండనుంది.

* అపాచీ ఆర్‌టీఎక్స్ 300:

స్పోర్టీ లుక్‌లో కనిపించే TVS అపాచీ చాలా మందికి ఫేవరెట్‌ బైక్‌గా ఉంటుంది. ఈ నెలలో అపాచీ నుంచి ఆర్‌టీఎక్స్ 300 లాంఛ్ కాబోతుంది. TVS మోటార్‌ నుంచి వస్తున్న తొలి అడ్వెంచర్‌ బైక్‌ కూడా ఇదే కావటం విశేషం. ఈ బైక్‌ను జనవరిలో నిర్వహించిన ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించారు. ఇక దీని ధర రూ.2,50,000 నుంచి ప్రారంభం కానుంది.

* హీరో కరిజ్మా ఎక్స్‌ఎంఆర్‌ 250:

ఇక మార్చిలో హీరో నుంచి కరిజ్మా ఎక్స్‌ఎంఆర్‌ 250 మార్కెట్‌లోకి ప్రవేశించనుంది. పాత ఎక్స్‌ఎంఆర్‌తో పోలిస్తే డిజైన్‌ పరంగా, లుక్‌ పరంగా చాలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. 250cc లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో 30PS పవర్, 25Nm టార్క్‌ను ఉత్పత్తి చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక దీని ప్రారంభ ధర రూ.2,20,000గా ఉంది.

* బజాజ్‌ చేతక్‌:

ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్‌లో బజాజ్ చేతక్ దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే బజాజ్ 35 సిరీస్‌లో మరో స్కూటర్‌ను ఈ నెలలో లాంచ్‌ చేయబోతోంది. ఈ సిరీస్‌ నుంచి చేతక్ డిసెంబర్‌‌లో 2 స్కూటర్లను లాంచ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇక ధర రూ.1,20,000 నుంచి ప్రారంభం కానుంది.

Next Story