SEBI: మాధబి బుచ్ వ్యవహారంలో ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి మరింత క్లారిటీ కోరిన కాంగ్రెస్

by S Gopi |
SEBI: మాధబి బుచ్ వ్యవహారంలో ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి మరింత క్లారిటీ కోరిన కాంగ్రెస్
X

దిశ, బిజినెస్ బ్యూరో: సెబీ ఛైర్‌పర్సన్ మాధబి పూరి బుచ్ వ్యవహారానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ విమర్శలు కొనసాగిస్తోంది. సెబీ చీఫ్ బాధ్యతలు తీసుకున్నప్పటికీ మాధబి బుచ్ గతంలో పనిచేసిన ఐసీఐసీఅ బ్యాంక్ నుంచి జీతం తీసుకుంటున్నట్టు సోమవారం కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. దీనిపై అదే సాయంత్రం ఐసీఐసీఐ బ్యాంక్ వివరణ ఇచ్చింది. రిటైర్‌మెంట్ ప్రయోజనాలు కాకుండా ఎలాంటి చెల్లింపులు చేయడంలేదని స్పష్టత ఇచ్చింది. అయితే, మంగళవారం మరోసారి కాంగ్రెస్ పార్టీ దీనిపై క్లారిటీ ఇవ్వాలని తెలిపింది. ఆమెకు రిటైర్‌మెంట్ ప్రయోజనాలు మాత్రమే ఇస్తున్నట్టు చెప్పినప్పటికీ, జీతం కంటే ఎక్కువ మొత్తం ఎలా ఇస్తుందని, గతంలో ఏడాది పాటు అటువంటి ప్రయోజనాలేమీ ఇవ్వకపోవడం కాంగ్రెస్ సందేహం వ్యక్తం చేసింది. 2015-16లో ఆమెకు ఎందుకు ఎలాంటి ప్రయోజనాలు చెల్లించలేదని కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేడా ప్రశ్నించారు. అలాగే, ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్‌లకు సంబంధించి 10 ఏళ్ల వరకు వాడుకోవచ్చని చెప్పింది. కానీ అమెరికా సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ కమిషన్‌కు దీనిపై 3 నెలలు మాత్రమే అని ఎందుకు పేర్కొందన్నారు. అదేవిధంగా, ఎంప్లాయి స్టాక్ ఆప్షన్‌కు సంబంధించి మూలం వద్ద పన్ను మినహాయింపును ఎందుకు బహిర్గతం చేయలేదని పేర్కొన్నారు.

Advertisement

Next Story