- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Stock Market: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. రూ.5 లక్షల కోట్లు ఆవిరి
దిశ, వెబ్ డెస్క్ : శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలి పోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూలత సూచనలతో భారీ నష్టాలు ఏర్పడ్డాయి. సెన్సెక్స్(Sensex) 1017 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ(Nifty) 292 పాయింట్లు నష్టపోయింది. ఫలితంగా ఈ ఒక్కరోజే రూ.5 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరయ్యింది. ఈరోజు రాబోయే అమెరికా(America) ఉద్యోగ డేటా మార్కెట్ సెంటిమెంట్ ను ఘోరంగా దెబ్బతీసిందని నిపుణులు తెలిపారు. గత రెండు రోజులుగా నష్టాలనే చవి చూస్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా నష్టాలతోనే ముగిశాయి. అయితే ఏషియన్ పెయింట్స్, దివిస్ లాబ్స్, బజాజ్ ఫినాన్స్, ఎల్&టీ, హీరో మోటార్ కార్ప్, హెచ్ యూఎల్, జేఎస్ డబ్ల్యూ వంటి షేర్లు మాత్రం భారీగా లాభపడ్డాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 73.13 వద్ద ముగిసింది. ఒక ఔన్స్ బంగారం ధర 2548.50 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
- Tags
- stock market