అంచనాలకు మించి డివిడెండ్ చెల్లించిన ప్రభుత్వ సంస్థలు

by S Gopi |
అంచనాలకు మించి డివిడెండ్ చెల్లించిన ప్రభుత్వ సంస్థలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కేంద్రం బడ్జెట్ అంచనాల కంటే ఎక్కువ డివిడెండ్‌ను పొందింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కోల్ ఇండియా, గెయిల్, ఓఎన్‌జీసీ, పవర్‌గ్రిడ్ సంస్థల నుంచి రాబడి పెరగడంతో డివిడెండ్ ఆదాయం బడ్జెట్ అంచనాల కంటే 26 శాతం పెరిగి రూ. 62,929.27 కోట్లు వచ్చాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రభుత్వ డివిడెండ్ ఆదాయ అంచనాలను రూ. 50,000 కోట్లకు సవరించిన సంగతి తెలిసిందే. మార్చి నెలలో ఓఎన్‌జీసీ నుంచి రూ. 2,964 కోట్లు, గెయిల్ రూ. 1,863 కోట్లు, పవర్‌గ్రిడ్ రూ. 2,143 కోట్లు, కోల్ ఇండియా రూ. 2,043 కోట్లు, హెచ్ఏఎల్ రూ. 1,054 కోట్లు, ఎన్ఎండీసీ రూ. 1,024 కోట్ల డివిడెండ్ వచ్చింది. గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ సంస్థల నుంచి కేంద్రానికి రూ. 59,952.84 కోట్ల డివిడెండ్ అందింది. గణాంకాల ప్రకారం, గత మూడేళ్లలో ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రభుత్వ బ్యాంకులు, బీమా సంస్థల సంయుక్త మార్కెట్ విలువ రూ. 15 లక్షల కోట్ల నుంచి ఏకంగా 500 శాతం పెరిగి రూ. 58 లక్షల కోట్లకు చేరింది. ప్రభుత్వ ఈక్విటీ హోల్డింగ్ విలువ 2021, జనవరిలో రూ. 9.5 లక్షల కోట్ల నుంచి 4 రెట్లు పెరిగి రూ. 38 లక్షల కోట్లకు పెరిగింది.

Advertisement

Next Story