- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గూగుల్ ప్లేస్టోర్ విధానాలపై విచారణకు సీసీఐ ఆదేశాలు
దిశ, బిజినెస్ బ్యూరో: ప్లే స్టోర్ విధానాలకు సంబంధించి గూగుల్ అనుసరించే యూజర్స్ ఛాయిస్ బిల్లింగ్ సిస్టమ్‌పై విచారణకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. కామిటీషన్ చట్టంలోని సెక్షన్ 4(2)(ఏ), సెక్షన్ 4(2)(బీ), సెక్షన్ 4(2)(సీ) నిబంధనలను గూగుల్ ఉల్లంఘించినట్టుగా ప్రాథమిక అభిప్రాయానికి వచ్చినట్టు కమిషన్ తెలిపింది. ఈ విషయంపై సమగ్రమైన విచారణ అవసరమని పేర్కొంది. 60 రోజుల్లోగా విచారణ జరిపి పూర్తి నివేదిక ఇవ్వాలని డైరెక్టర్ జనరల్(డీజీ)ని కమిషన్ ఆదేశించింది. ఇటీవల గూగుల్ తన యూసీబీ సిస్టమ్‌ను పాటించలేదనే ఆరోపణలతో పలు యాప్‌లను ప్లే స్టోర్ నుండి తొలగించింది. వాటిలో షాదీ, భారత్ మ్యాట్రిమోనీ, బాలాజీ టెలిఫిల్మ్స్ ఆల్ట్ (గతంలో ఏఎల్‌టీ బాలాజీ), ఆడియో ప్లాట్‌ఫామ్ కుకు ఎఫ్ఎం, డేటింగ్ సర్వీస్ క్వాక్ క్వాక్, ఇన్ఫో ఎడ్జ్ గ్రూపునకు చెందిన నౌక్రీ డాట్ కామ్,99 ఏకర్స్ ఉన్నాయి. కంపెనీ విధానాలకు ఒప్పుకున్న తర్వాత వాటిని తిరిగి ప్లే స్టోర్‌లో అనుమతిచ్చింది. యాప్‌లను కొనుగోలు చేయడానికి లేదా యాప్‌లో బిల్లింగ్ కోసం యాప్ డెవలపర్లను థర్డ్-పార్టీ బిల్లింగ్ లేదా పేమెంట్ ప్రాసెసింగ్ సేవలను ఉపయోగించకుండా కంపెనీని నియంత్రించవద్దని కోరుతూ సీసీఐ మునుపటి ఆదేశాలను గూగుల్ ఉల్లంఘించిందని ఆయా యాప్ కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్‌పై సీసీఐ విచారణకు ఆమోదించింది.