- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
6 నెలల వరకు బంగారం కొనలేమా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?

దిశ,వెబ్‌డెస్క్: ఇంట్లో ఏ శుభకార్యం జరిగిన మహిళలు బంగారు అభరణాలు ధరిస్తారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో మహిళలందరూ బంగారానికి(Gold) ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అనేక డిజైన్లతో లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు. ఈ క్రమంలో బంగారం ధరలు(Gold Rates) ఎప్పుడు తగ్గుతాయా? అని మహిళలు వేయి కళ్లతో ఎదురు చూస్తారు. ఈ తరుణంలో బంగారానికి మరోసారి రెక్కలోచ్చాయి. కొన్ని వారాల నుంచి స్థిరంగా ఉన్న పసిడి ధరలు గత వారం రోజుల్లో 2,500 పైగా పెరిగి బంగారం ప్రియులకు షాక్ ఇచ్చింది.
ఇదిలా ఉంటే.. ట్రంప్ టారిఫ్స్ నేపథ్యంలో ఆరు నెలల వరకు బంగారం రేట్లు అస్థిరంగా ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అప్పటి వరకు అధిక ధరలు కొనుగోళ్లపై ప్రభావం చూపిస్తాయని పేర్కొంటున్నారు. ఇన్వెస్టర్లకు మాత్రం ఉపయోగకరమేనని అంటున్నారు. ఓపెన్ మార్కెట్‌లో 24k గోల్డ్ 10 gr ధర రూ.82వేలు దాటేసింది. ఇండియన్ బులియన్, జువెలరీ అసోసియేషన్ (IBJA) ప్రకారం తొలిసారి రూ.80,194 దాటింది. 2024 అక్టోబర్ 30 నాటి రూ.79,681ని దాటేసింది.