యూజర్లకు బిగ్ షాకిచ్చిన BSNL.. ఇకపై ఆ ప్లాన్లు అందుబాటులో ఉండవు

by D.Reddy |
యూజర్లకు బిగ్ షాకిచ్చిన BSNL.. ఇకపై ఆ ప్లాన్లు అందుబాటులో ఉండవు
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో ప్రభుత్వ రంగ టెలికం సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL)కు కస్టమర్లు విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యూజర్లను మరింత ఆకర్షించేందుకు కొత్త కొత్త ప్లాన్లను సైతం ప్రవేశపెట్టింది. అయితే, తాజాగా BSNL తన కోట్లాది మంది వినియోగదారులకు షాక్ ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. తమ ప్రీపెయిడ్ పోర్టు ఫోలియో నుంచి అత్యంత ప్రజాదరణ పొందిన మూడు ప్లాన్లను తొలగించనుంది. ఈ నెల 10వ తేదీ తర్వాత యూజర్లకు ఆ ప్లాన్లు అందుబాటులో ఉండవు. ఈ లోపు రీఛార్జ్ చేసుకున్నవారు ఆ ప్రయోజనాలను పొందవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

రూ. 201 ప్లాన్..

BSNL యూజర్లు రూ.201తో రీఛార్జ్ చేసుకుంటే 90 రోజుల వాలిడిటీతో 300 నిమిషాల కాలింగ్, 6GB డేటా సౌకర్యాన్ని పొందుతారు. ఇవి కాకుండా ఈ ప్లాన్‌లో ఇతర ప్రయోజనాలు ఏవీ లేవు. కాకపోతే, సిమ్‌ను ఎక్కువ కాలం యాక్టివ్‌గా ఉంచడానికి ఇది ఉత్తమ ప్లాన్.

రూ 797 ప్లాన్..

BSNL వినియోగదారులు రూ.797 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే 60 రోజుల వాలిడిటీతో అన్ లిమిటెడ్ కాలింగ్, 2GB రోజువారీ డేటా, రోజువారీ 100 SMS ఉచితంగా లభిస్తాయి. ఈ ప్లాన్‌లో సిమ్ 300 రోజుల పాటు యాక్టివ్‌గా ఉంటుంది.

రూ. 2999 ప్లాన్..

BSNLలో 365 రోజు పాటు వాలిడిటీతో ఉండే ప్లాన్ రూ.2999. ఇందులో యూజర్లు ప్రతిరోజూ 3GB డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్, ప్రతిరోజూ 100 SMSల ప్రయోజనం పొందుతారు. పూర్తి ఏడాదికి మొత్తం ఒకేసారి రీఛార్జ్ చేసుకోవాలనేవారికి ఇది ఎంతగానో మేలు చేకూరుతుంది.

ఇక, BSNL వినియోగదారులు ఫిబ్రవరి 10 లోపు రీఛార్జ్ చేసుకుంటే.. ప్లాన్ కాలపరిమితి వరకూ ఈ ప్లాన్ల ప్రయోజనాలను పొందవచ్చు.

Next Story