- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ఆర్బీఐ కీలక నిర్ణయం.. 6.5 శాతం రెపో రేటు యథాతథం
దిశ, వెబ్‌డెస్క్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ సమీక్షలో ఇండియా పాలసీ రెపో రేటును వరుసగా నాలుగోసారి యథాతథంగా ఉంచాలని నిర్ణయించారు. అయితే, ఆర్థిక విధాన కమిటీ సమావేశంలో ఆరుగురు సభ్యులలో ఐదుగురు ఇదే నిర్ణయానికి మద్దతునిచ్చారు. అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్-2024 ఆర్థిక సంవత్సరానికి గాను గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ (జీడీపీ) అంచనాను 7 శాతం వద్ద మార్చకుండా ఉంచింది. ఈ సందర్భంగా ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ విలేకరులతో మాట్లాడుతూ.. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతోందని పేర్కొన్నారు.
ఆర్‌బీఐ బహుముఖ విధానాలు ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచడంలో బాగా పని చేశాయని ఆయన పేర్కొన్నారు. ఉక్రెయిన్-రష్యా, ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధాలు, ఎర్ర సముద్రంలో హౌతీల దాడులతో ఏర్పడిన సంక్షోభం అనిశ్చితిని కలిగిస్తున్నాయని ఆయన అన్నారు. గడిచిన మూడేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ 7 శాతానికి వృద్ధి చెందిందని తెలిపారు. ఈ క్రమంలోనే ద్రవ్యోల్బణం రేటు ఆర్‌బీఐ నిర్దేశించిన 4 శాతం పరిమితికి చేరువలో ఉండడంతో రెపో రేటు 6.5 శాతం వద్దే ఉండటం సరైందని శక్తికాంత దాస్ అన్నారు.