- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిన్న పొరపాటు వల్ల గూగుల్‌కు రూ. 8.24 లక్షల కోట్ల నష్టం!
శాన్‌ఫ్రాన్సిస్కో: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) టెక్నాలజీ వినియోగంలో పోటీనిచ్చేందుకు గూగుల్ చేసిన ప్రయత్నానికి మొదట్లోనే గట్టి దెబ్బ తగిలింది. ఇటీవల సంచలనంగా మారిన చాట్‌జీపీటీకి పోటీగా గూగుల్ తీసుకొచ్చిన 'బార్డ్' చాట్‌బాట్‌లో చిన్న తప్పిదం కారణంగా గూగుల్‌కు భారీ నష్టం వాటిల్లింది. ప్రమోషనల్ వీడియోలో భాగంగా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ గురించి అడిగిన ఒక ప్రశ్నకు బార్డ్ పొరపాటున వేరే సమాధానం ఇచ్చింది. సౌర వ్యవస్థకు బయట ఉన్న గ్రహాల ఫొటోలను మొదటగా జేమ్స్ వెబ్ స్పేస్ తీసినట్టు జవాబిచ్చింది. దీనివల్ల గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ షేర్ ధరపై ప్రభావం కనబడింది.
అమెరికా ఎక్స్ఛేంజీలలో కంపెనీల షేర్ ధర ఏకంగా 8 శాతం పడిపోవడంతో గూగుల్ ఒక్కరోజే ఏకంగా 100 బిలియన్ డాలర్లు( భారత కరెన్సీలో రూ. 8.24 లక్షల కోట్ల) నష్టం ఏర్పడింది. ఆ మేరకు ఆల్ఫాబెట్ మార్కెట్ విలువ క్షీణించింది. నిజానికి సౌర వ్యవస్థకు వెలుపల గ్రహాల ఫొటోలను 2004లో యూరప్ సదరన్ అబ్జర్వేటరీ కి చెందిన టెలీస్కోప్ తీసింది. ఈ పొరపాటు కారణంగా గూగుల్ భారీ నష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.