- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కుబేరులకు షాక్.. తరిగిపోతున్న అదానీ, అంబానీ సంపద.50 రోజుల్లో ఎన్ని లక్షల కోట్లు లాస్ అంటే

దిశ, వెబ్ డెస్క్: Adani, Ambani wealth: కొంతకాలంగా స్టాక్ మార్కెట్లు(Stock Markets) భారీగా పడిపోతున్నాయి. ఈ తరుణంలో దిగ్గజ పారిశ్రామిక వేత్తలు భారీగా నష్టాలను ఎదుర్కొవల్సి వస్తుంది. వారి కంపెనీల షేర్లు పతనం అవుతుండటమే దీనికి కారణం. 2025లో ఇప్పటి వరకు ఎక్కువగా నష్టపోయిన వారిలో భారత్ కు చెందిన గౌతమ్ అదానీ (Gautham Adani) రెండో స్థానంలో ఉన్నారు. అపర కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Mask)ఏకంగా రూ. 3లక్షల కోట్లు నష్టపోయాడు. అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ(Gautham Adani) 2025లో ఇప్పటి వరకు అంటే దాదాపు 50 రోజుల వ్యవధిలో 11.9 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయారు. భారత కరెన్సీలో చూస్తే సుమారు 1లక్ష కోట్లుగా ఉంటుంది. ఇప్పుడు ఆయన మొత్తం సంపద రూ. 5.75లక్షల కోట్లకు పరిమితం అయ్యింది.
ప్రస్తుతం సంవత్సరంలో అత్యధికంగా సంపదను కోల్పోయిన వారిలో అదానీ(Gautham Adani) రెండో స్థానంలో ఉన్నట్లు బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్(Bloomberg Billionaires Index) తెలిపింది. ప్రపంచ కుబేరుల జాబితాలో గౌతమ్ అదానీ ఏకంగా 23వ స్థానానికి పడిపోయారు. 2023లో హిండెన్ బర్గ్ రిపోర్ట్(Hindenburg Report) వెలువడక ముందు అదానీ ఒక దశలో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఏకంగా రెండవ స్థానానికి కూడా చేరారు. రిపోర్టు తర్వాత ఒక దశలో టాప్ 30 అవతలికి చేరారు. ఆ తర్వాత క్రమంగా పుంజుకుంటూ వస్తున్నారు.
2025లో అత్యధికంగా నష్టపోయిన వారిలో అగ్రస్థానంలో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన టెస్లా, స్పెస్ ఎక్స్, ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ (Elon Mask) ఉన్నారు. ఈ ఏడాదిలో మస్క్ (Elon Mask) సంపద సుమారు రూ. 3లక్షల కోట్లు తగ్గి ఇప్పుడు 397 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది భారత కరెన్సీలో రూ. 34లక్షల కోట్ల వరకు ఉంటుంది. భారత దిగ్గజ పారిశ్రామికవేత్త, అత్యంత ధనవంతుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్(Mukesh ambani) అంబానీ బ్లూమ్ బెర్ట్ బిలియనీర్స్ జాబితాలో 17వ స్థానంలో నిలిచారు.
అంబానీ(Mukesh ambani) సంపద సుమారు రూ. 25వేల కోట్లు తగ్గింది. దీంతో ఇప్పుడు రూ. 7.50లక్షల కోట్లకు పడిపోయింది. ఇక ఐటీ సంస్థ హెచ్ సీఎల్(HCL) టెక్నాలజీస్ అధినేత శివ్ నాడార్ సంపద రూ. 39వేల కోట్లు పడిపోయి ప్రస్తుతం రూ. 3.32 లక్షల కోట్లు ఉంది. ప్రపంచ అపర కుబేరుల్లో మస్క్ తొలిస్థానంలో ఉండగా..ఆ తర్వాత వరుసగా మెటా చీఫ్ మార్క్ జుకర్ బర్గ్(Zuckerberg), అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్(Jeff Bezos), ఒరాకిల్ ఫౌండర్ లారీ ఎల్లిసన్(Larry Ellison) ఉన్నారు.