Nitish Kumar: థాంక్యూ నిర్మలమ్మ.. బడ్జెట్ పై నితీష్ ఏం అన్నారో చూడండి

by Vennela |
Nitish Kumar: థాంక్యూ నిర్మలమ్మ.. బడ్జెట్ పై నితీష్ ఏం అన్నారో చూడండి
X

దిశ, వెబ్ డెస్క్: Nitish Kumar: 2025-26 సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంట్ లో బడ్జెట్ ను సమర్పించారు. ఈ బడ్జెట్ పై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పందించారు. ప్రగతిశీల, భవిష్యత్తును ద్రుష్టిలో పెట్టుకుని రూపొందించిన బడ్జెట్ అంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్ర వృద్ధి రేటు మరింత వేగవంతం అవుతుందన్నారు. ఏడాదిలోపు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బిహార్ భవిష్యత్ లక్ష్యాలను చేరుకునే దిశగా మఖానా బోర్డ్, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులను ఏర్పాటు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారని నితీశ్ కుమార్ గుర్తు చేశారు.

ఇది ఆచరణాత్మక ముందు చూపుతో రూపుదిద్దుకున్న బడ్జెట్. ఇది రాష్ట్ర వృద్ధి రేటును మరింత వేగవంతం చేస్తుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటూ ఓ ప్రకటనలో నితీశ్ కుమార్ తెలిపారు. మఖానా బోర్డు ఏర్పాటుతో ఫాక్స్ నట్ పంట సాగు పురోభివ్రుద్ధికి దోహదపడుతుందని తద్వారా ప్రపంచ దేశాలకు గుర్తింపు ఇస్తుందన్నారు.

ప్రతిపాదిత గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులతో బిహార్ కు ఎయిర్ కనెక్టివిటీ లభిస్తుందని..తద్వారా మరిన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయని నితీశ్ కుమార్ చెప్పారు. ఐఐటీ పాట్నా కెపాసిటీ పెంపుతో బిహార్ లో సాంకేతిక విద్యను బలోపేతం చేస్తుందని నితీశ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఆదాయం పన్ను శ్లాబ్స్ సవరణతో మధ్య తరగతి ప్రజలకు ఉపశమనం లభిస్తుందని అన్నారు.

కాగా కేంద్ర బడ్జెట్లో బిహార్ పైన వరాలు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వంలో బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కీలక భాగస్వామిగా ఉన్నారు. త్వరలోనే బిహార్ లో ఎలక్షన్స్ జరగనున్నాయి. దీంతో ఈ సారి బడ్జెట్లో బిహార్ కు ప్రాధాన్యత ఉంటుందని అంతా భావిస్తున్నారు. అంచనాలకు తగినట్లుగానే బిహార్ కు నిర్మలా సీతారామన్ పలు ప్రకటనలు చేశారు. బిహార్ లో మఖానా బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు నిర్మల సీతారామన్ ప్రకటించారు. దీంతోపాటుగా పాట్నాలో ఐఐటీని విస్తరిస్తున్నట్లు తెలిపారు.

బడ్జెట్ లో బిహార్ కు నిజంగా చాలా ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పుకోవచ్చు. ఎందుకంటే బిహారీలు చాలా సంవత్సరాలుగా మఖానాను పండిస్తున్నారు. మఖానా అంటే ఇదొక రకమైన ఆహారం. దేశంలో 90శాతం మఖానాను బిహార్ లో మాత్రమే ఉత్పత్తి చేస్తారు. ఉత్తర బిహార్ ప్రాంతంలో అధికంగా పండిస్తారు. దీంతో ఆ ప్రాంతానికి మఖానా ప్రాంతం అనే పేరు కూడా వచ్చింది. బడ్జెట్ లో చేసిన ఈ ప్రకటనతో ఈ రంగంలో కొత్త ఉపాధి అవకాశాలు కూడా ఏర్పడనున్నాయి. మఖానాకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో ప్రభుత్వం దాని ఉత్పత్తిని మరింత ప్రోత్సహించాలని యోచిస్తోంది.


Next Story

Most Viewed