- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Bank Loans: 71 శాతం పెరిగిన బంగారు రుణాలు

దిశ, బిజినెస్ బ్యూరో: డిమాండ్ తగ్గిన కారణంగా డిసెంబర్ నెలలో పరిశ్రమలు, సేవలు, రిటైల్, వ్యవసాయ రంగాల్లో బ్యాంకులు రుణాలు గణనీయంగా తగ్గాయని భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) తాజా డేటాలో పేర్కొంది. 'సెక్టోరల్ డిప్లాయిమెంట్ ఆఫ్ బ్యాంకు క్రెడిట్' డేటా ప్రకారం.. దాదాపు అన్ని రకాల రుణాలు తగ్గాయి. కానీ, రిటైల్ విభాగంలో బంగారు ఆభరణాలపై లోన్లు మాత్రమే గతేడాది కంటే 71 శాతం పెరిగాయి. బంగారం ధరలు రికార్డు స్థాయికి పెరగడంతో బ్యాంకులు తాకట్టు పెట్టిన వాటిపై ఎక్కువ మొత్తం రుణాలు ఇచ్చాయి. 2022, డిసెంబర్ నాటికి బంగారు ఆభరణాలపై ఇచ్చే రుణాలు రూ. 86,000 కోట్లు ఉండగా, 2024, డిసెంబర్ చివరి నాటికి రూ. 1.72 లక్షల కోట్లకు రెండేళ్లలో రెట్టింపు కావడం విశేషం. గతేడాది డిసెంబర్ 27 నాటికి పరిశ్రమలకు ఇచ్చే రుణాలు 7.4 శాతం పెరిగాయి. ప్రధాన పరిశ్రమలైన ఫుడ్ ప్రాసెసింగ్, పెట్రోలియ, బొగ్గు ఉత్పత్తులు, అణు ఇంధనాలు, అన్ని ఇంజనీరింగ్ సంస్థల్లోనూ క్రెడిట్ వృద్ధి మెరుగ్గా ఉంది. అయిత్, నిర్మాణ రంగంలో రుణాలు మాత్రం క్షీణించాయని ఆర్‌బీఐ డేటా పేర్కొంది. రిటైల్ విభాగంలో పర్సనల్, అన్‌సెక్యూర్‌డ్, వెహికల్ లోన్లు తగ్గిన కారణంగా రిటైల్ క్రెడిట్ 14.9 శాతం పడిపోయింది. సేవల రంగంలో రుణాలు గతేడాదితో పోలిస్తే 13 శాతం క్షీణించాయి. వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలకు ఇచ్చే క్రెడిట్ 12.5 శాతం తగ్గినట్టు ఆర్‌బీఐ డేటా వెల్లడించింది.