ప్రీమియం ఉత్పత్తులపై దృష్టి సారించిన బజాజ్ ఎలక్ట్రికల్స్!

by Dishaweb |
ప్రీమియం ఉత్పత్తులపై దృష్టి సారించిన బజాజ్ ఎలక్ట్రికల్స్!
X

న్యూఢిల్లీ: ప్రీమియం విభాగంలో ఉత్పత్తులను అందించడం ద్వారా మరింత వృద్ధిని సాధించాలని భావిస్తున్నట్టు ప్రముఖ గృహోపకరణాల తయారీ సంస్థ బజాజ్ ఎలక్ట్రికల్స్ తెలిపింది. గృహోపకరణాలతో పాటు ఇతర విభాగాల్లో కొత్త ప్రీమియం ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావడం ద్వారా ఆదాయ పెరుగుతుందని ఆశిస్తున్నట్టు కంపెనీ ఎండీ, సీఈఓ అనుజ్ పొద్దార్ అన్నారు. ఇటీవలే కంపెనీ ప్రీమియం విభాగంలో కొత్త 'నెక్స్ 'బ్రాండ్‌ను ప్రారంభించింది. ఈ బ్రాండ్ ద్వారా కంపెనీ పట్టణ వినియోగదారులే లక్ష్యంగా ప్రీమియం ఉత్పత్తులను తీసుకురానుంది. కొన్ని విభాగాల్లో అమ్మకాలు క్షీణించినప్పటికీ బజాజ్ ఎలక్ట్రికల్స్ ప్రీమియం స్పేస్‌లో ఈ ఏడాదిలోపు కొత్త ఉత్పత్తులను తీసుకురానుంది. ఇది మొత్తం కంపెనీ ఆదాయానికి సహకరిస్తుంది. కంపెనీ బ్రాండ్ వృద్ధి, ఉత్పత్తుల ప్రీమియమైజేషన్ అనే రెండు అంశాలపై దృష్టి పెడుతున్నామని, దాని వల్ల కంపెనీ మార్కెట్ వాటా పెరిగేందుకు అవకాశం ఉంటుందని అనుజ్ పొద్దార్ చెప్పారు. ఇటీవల ఫ్యాన్స్ ఉత్పత్తులకు కూడా స్టార్ రేటింగ్ అమలు కావడంతో మార్కెట్లో డిమాండ్ తగ్గిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి తోడు ధరలు పెరుగుదల వల్ల కూడా ఆదాయం తగ్గిందని ఆయన వివరించారు.

Advertisement

Next Story

Most Viewed