- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫిక్స్‌డ్ డిపాజిట్లపై గుడ్‌న్యూస్ చెప్పిన Axis Bank
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎంపిక చేసిన కాలవ్యవధులపై బ్యాంకు 5 బేసిస్ పాయింట్లు పెంచగా, సవరించిన రేట్లు శుక్రవారం నుంచే అమల్లోకి వస్తాయని బ్యాంకు ఓ ప్రకటనలో వెల్లడించింది. రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై 9 నెలల నుంచి ఏడాది 24 నెలల కాలవ్యవధిపై 5 బేసిస్ పాయింట్లు పెంచడంతో వడ్డీ రేటు 6 శాతానికి మార్చింది. మొత్తంగా 7 రోజుల నుంచి 10 ఏళ్లలోపు ఎఫ్‌డీలపై బ్యాంకు 3.5 శాతం నుంచి 7.20 శాతం మధ్య వడ్డీ ఇస్తోంది. 2 ఏళ్ల నుంచి 30 నెలల మధ్య డిపాజిట్లకు అత్యధికంగా 7.20 శాతం వడ్డీని బ్యాంకు ఆఫర్ చేస్తోంది. సీనియర్ సిటిజన్లకు 7.95 శాతం వడ్డీని బ్యాంకు అందజేస్తోంది.
బ్యాంకు అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, 7-45 రోజుల డిపాజిట్లకు 3.5 శాతం, 46-60 రోజులకు 4 శాతం, 61 రోజుల నుంచి 3 నెలలకు 4.5 శాతం, 3-6 నెలల మధ్య 4.75 శాతం, 6-9 నెలల మధ్య కాలానికి 5.75 శాతం, ఏడాది నుంచి ఏడాది 24 రోజులకు 6.8 శాతం, ఏడాది 24 రోజుల నుంచి 13 నెలలకు 7.1 శాతం, 13 నెలల నుంచి 2 ఏళ్ల వరకు 7.15 శాతం, 30 నెలల నుంచి 10 ఏళ్ల వరకు 7 శాతం వడ్డీ లభిస్తుంది. అన్ని కాలవ్యవధులపై సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.50 శాతం వడ్డీ వర్తిస్తుంది.
Also Read...