- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోసాలను గుర్తించడం కోసం Paytmలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
ముంబై: ప్రముఖ ఆన్‌లైన్ చెల్లింపుల ప్లాట్‌ఫారమ్ Paytm తన కొత్త టెక్ ప్లాట్‌ఫారమ్‌లో కృత్రిమ మేధస్సును(AI) ఉపయోగించనుంది. మోసాలను గుర్తించడం, కస్టమర్ కేర్ సర్వీస్‌లను మెరుగుపరచడం వంటి వాటి కోసం జనరేటివ్ AIను వాడనున్నట్లు కంపెనీ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. గత ఏడాది కాలంగా దీని కోసం ప్రయత్నాలు చేస్తున్నామని, మా వ్యాపారాన్ని మరిన్ని కొత్త పుంతలు తొక్కించడానికి, అలాగే, టెక్స్ట్, ఆడియో, వీడియో, కోడ్, మొదలైన వాటిని విశ్లేషించడం వంటి నిర్దిష్ట విధులను నిర్వహించడానికి, వివిధ సమస్యల పరిష్కారానికి ఇది సహాయపడుతుందని అన్నారు.
కొత్త టెక్ ప్లాట్‌ఫారమ్ పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేయబడిందని, ప్రస్తుత లావాదేవీల సంఖ్య కంటే 10 రెట్లు నిర్వహించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు పేర్కొన్నారు. Paytm ఆదాయం మార్చి త్రైమాసికంలో 52 శాతం పెరిగి రూ. 2,335 కోట్లకు చేరుకోగా, నష్టం రూ. 763 కోట్ల నుంచి రూ. 168 కోట్లకు తగ్గింది. చెల్లింపుల సేవల ఆదాయం 41 శాతం పెరిగి రూ.1,467 కోట్లకు చేరుకుంది. స్థూల వ్యాపార విలువ (GMV) 2023 ఆర్థిక సంవత్సరం క్యూ4లో 40 శాతం పెరిగి రూ. 3.62 లక్షల కోట్లకు చేరుకుంది.
ఇవి కూడా చదవండి : ఉచితంగా 5GB డేటా..