- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IPhone: 2025 నుంచి అన్ని ఐఫోన్‌లలో ఓఎల్ఈడీ డిస్‌ప్లే
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రీమియం స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ యాపిల్ ఎల్‌సీడీ డిస్‌ప్లేలకు గుడ్‌బై చెప్పనుంది. 2025 నుంచి విక్రయించే అన్ని ఐఫోన్ మోడళ్లలో ఓఎల్ఈడీ డిస్‌ప్లేలను ఉపయోగించాలని యాపిల్ నిర్ణయించినట్టు సమాచారం. దీనికి సంబంధించి జపాన్‌కు చెందిన నిక్కీ వార్తాపత్రిక తన కథనంలో పేర్కొంది. ఇప్పటికే టెలివిజన్, పలు స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు ఎల్‌సీడీల నుంచి ఓఎల్ఈడీ డిస్‌ప్లేలకు మారుతున్నాయి. దీనివల్ల హై-డెఫినిషన్ వీడియోలకు అనువైన, స్పష్టమైన కలర్స్, కాంట్రాస్ట్‌లను అందించే సామర్థ్యం ఓఎల్ఈడీలకు ఉండటమే. ఇప్పటికే కంపెనీలు ఓఎల్ఈడీ డిస్‌ప్లేలను అందిస్తుండటంతో యాపిల్ సైతం తన రాబోయే ఐఫోన్ ఎస్ఈ మోడల్ కోసం ఓఎల్ఈడీ డిస్‌ప్లేలను ఆర్డర్ చేసినట్టు నిక్కీ కథనం పేర్కొంది. యాపిల్ కంపెనీ మొదటిసారిగా 2017లో తన ఐఫోన్ ఎక్స్‌లో ఓఎల్ఈడీ ప్యానెల్‌లను ఉపయోగించింది. అప్పటి నుంచి ప్రీమియం ఐఫోన్ మోడళ్ల కోసం వీటిని ఉపయోగిస్తోంది. ఈ ఏడాది మేలో తన కొత్త జనరేషన్ ఐప్యాడ్ ప్రో మోడళ్లకు ఓఎల్ఈడీ స్క్రీన్‌లతో తీసుకొచ్చింది. తాజా కథనాలకు సంబంధించి యాపిల్ సంస్థ అధికారికంగా స్పందించలేదు.