- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
Amazon: అమెజాన్‌లో మరోసారి ఉద్యోగుల తొలగింపు

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి ఉద్యోగులను తొలగించనుంది. ప్రధానంగా కార్యకలాపాలను క్రమబద్ధీకరించేందుకు, ఖర్చులను తగ్గించే ప్రయత్నంలో భాగంగా కమ్యూనికేషన్ విభాగంలో లేఆఫ్స్ ప్రక్రియ చేపట్టనుంది. కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ తొలగింపులు దోహదపడతాయని కంపెనీ భావిస్తోంది. దీనిపై స్పందించిన అమెజాన్ ప్రతినిధి బ్రాడ్ గ్లాసర్.. ఉద్యోగులను తొలగింపు ఉంటుందని, కష్టమైన నిర్ణయమే అయినప్పటికీ వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు, సంస్థ పనితీరును మరింత పటిష్టం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. లేఆఫ్స్ ప్రభావంతో ఉద్యోగాలను కోల్పోయిన వారికి మద్దతిచ్చేందుకు కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు. అయితే, ఎంతమందిని తొలగించనున్నారనే విషయంపై కంపెనీ స్పష్టత ఇవ్వలేదు. అమెజాన్ సీఈఓగా యాండీ జస్సీ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కంపెనీ పునర్నిర్మాణంలో భాగంగా ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2022లో వివిధ విభాగాల్లో ఒకేసారి 22 వేల మందిని తొలగించడమే కాకుండా రిటర్న్-టు-ఆఫీస్ ఆదేశాలను అమలు చేయడం, వారానికి ఐదు రోజులు ఆఫీసు నుంచి పని చేయాలనే నిబంధన తీసుకొచ్చారు. తాజాగా కమ్యూనికేషన్స్ విభాగంలో తొలగింపుల నిర్ణయం తీసుకున్నారు.