- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరో 20 వేల మంది ఉద్యోగులను సాగనంపేందుకు సిద్ధమవుతున్న అమెజాన్!
న్యూఢిల్లీ: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇటీవలే భారీ సంఖ్యలో ఉద్యోగాలను తొలగించిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం భయాలు పెరుగుతుండటం, కంపెనీల ఆదాయం క్షీణించడం, ఖర్చులను తగ్గించే చర్యల్లో భాగంగా కంపెనీ పెద్ద ఎత్తున తొలగింపుల ప్రక్రియను చేపడుతున్నాయి. తాజాగా అమెజాన్‌లో దాదాపు మరో 20 వేల మందిని తొలగించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇది గతంలో తొలగించిన దానికి రెండు రెట్లు ఎక్కువ. వివిధ ప్రాంతాల్లో టెక్ విభాగంతో పాటు డిస్ట్రిబ్యూషన్, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లను తొలగించడానికి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.
రానున్న నెలల్లో ఈ తొలగింపుల ప్రక్రియ ఉంటుందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. ఎంపిక చేసిన విభాగాల్లో మళ్లీ తొలగింపులు ఉంటాయని అమెజాన్ సీఈఓ యాండీ జెస్సీ ఈ మధ్యనే సంకేతాలిచ్చారు.ఇప్పటికే తొలగించే ఉద్యోగుల సామర్థ్య వివరాల సేకరణపై మేనేజర్లకు ఆదేశాలిచ్చినట్టు తెలుస్తోంది. సాగనంపే ఉద్యోగులకు 24 గంటల ముందుగా నోటీసుల్లో పరిహారం గురించి స్పష్టం చేయనున్నారని సమాచారం. దీంతో మరోసారి అమెజాన్‌లో తొలగింపులపై ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.