- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశీయ విమానయాన సంస్థల నష్టాలు రూ. 3,000-4,000 కోట్లుగా అంచనా
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో దేశీయ విమానయాన సంస్థలు రూ. 3,000-4,000 కోట్ల వరకు నికర నష్టాలను ఎదుర్కొనవచ్చని అంచనా. ఈ మేరకు ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తాజా నివేదికలో తెలిపింది. ఎయిర్ ట్రాఫిక్ పెరుగుదల, ధరల మార్పు ఇందుకు కారణమని సోమవారం విడుదలైన ఇక్రా నివేదిక పేర్కొంది. ఫిబ్రవరి నెలకు సంబంధించి దేశీయ విమాన ప్రయాణీకుల రద్దీ దాదాపు 127.5 లక్షలుగా అంచనా. గత కొంతకాలంగా విమానయాన రంగం ప్రాట్ అండ్ విట్నీ ఇంజిన్‌లకు సంబంధించి సరఫరా సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ సమస్య కారణంగా ఇండిగో 70కి పైగా విమానాలను నిలిపేసింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి కార్యకలాపాలను నిర్వహించే దేశీయ ఎయిర్‌లైన్ కంపెనీల మొత్తం విమానాల్లో 24-26 శాతం విమానాలు గ్రౌండింగ్ అవుతాయని తెలుస్తోంది. నివేదిక ప్రకారం, విమానయాన సంస్థలు ప్రయాణికుల సంఖ్యలో ఆరోగ్యకర వృద్ధి, స్థిరమైన వ్యయ వాతావరణం నేపథ్యంలో నష్టాలు తగ్గుతాయని ఇక్రా అభిప్రాయపడింది. గత ఆర్థిక సంవత్సరం విమాన ఇంధన ధరల పెరుగుదల కారణంగా పరిశ్రమ రూ. 1700-1750 కోట్ల మేర నష్టాలను చూసింది.