- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
సిబ్బంది కొరతతో అమెరికా విమాన సర్వీసులను తగ్గించిన ఎయిర్ ఇండియా!
న్యూఢిల్లీ: సిబ్బంది కొరత ఉన్న కారణంతో ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ఇండియా తాత్కాలికంగా అమెరికాలోని కొన్ని రూట్లలో విమాన సర్వీసులను తగ్గిస్తున్నట్టు వెల్లడించింది. ప్రస్తుతం బోయింగ్ 777 విమానాల కోసం రాబోయే మూడు నెలల్లో 100 మంది పైలట్లు అందుబాటులోకి వస్తారని, మరో 1,400 మంది క్యాబిన్ సిబ్బంది కూడా శిక్షణలో ఉన్నారని సంస్థ సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ సోమవారం ప్రకటనలో తెలిపారు. సిబ్బంది సంఖ్య తక్కువగా ఉన్నందున దూర ప్రాంతాలకు విమానాలను నడపడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు.
కాగా, ఎయిర్ఇండియాలో ప్రస్తుతానికి 11 వేల మంది వరకు సిబ్బంధి పని చేస్తున్నారు. పరిశ్రమలో సవాళ్లు ఉన్నాయని, ఎయిర్ఇండియా గతంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్న తర్వాత ఇప్పుడిప్పుడే వృద్ధి చెందుతోందని ఢిల్లీలో జరిగిన సెంటర్ ఫర్ ఏవియేషన్ కార్యక్రమంలో క్యాంప్‌బెల్ చెప్పారు. కాగా, పూర్తిగా ఆర్థిక కష్టాల్లో ఉన్న ఎయిర్ఇండియాను టాటా గ్రూప్ గతేడాది జనవరిలో కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. సంస్థ పునరుద్ధరణలో భాగంగా ఇటీవల విమానయాన చరిత్రలోనే రికార్డు స్థాయిలో 470 కొత్త విమానాలను ఆర్డర్ చేసింది.