81 శాతం పెరిగిన ఏజీఐ గ్రీన్‌ప్యాక్ లాభాలు!

by Harish |
81 శాతం పెరిగిన ఏజీఐ గ్రీన్‌ప్యాక్ లాభాలు!
X

హైదరాబాద్: ప్రముఖ ప్యాకేజింగ్ సంస్థ ఏజీఐ గ్రీన్‌ప్యాక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో రూ. 53 కోట్ల నికర లాభాలను ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ సాధించిన లాభాలతో పోలిస్తే 81 శాతం పెరిగింది. కంపెనీ కార్యకలాపాల ఆదాయం అంతకుముందు ఏడాది కంటే 43 శాతం వృద్ధితో రూ. 567 కోట్లుగా వెల్లడించింది. అదేవిధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ మధ్య కంపెనీ నికర లాభాలు 94 శాతం పెరిగి రూ. 153 కోట్లుగా నమోదయ్యాయి. కార్యకలాపాల ఆదాయం 60 శాతం వృద్ధితో రూ. 1,601 కోట్లుగా ఉన్నాయి.

మెరుగైన ఉత్పత్తి, పానీయాలు, ప్యాకేజ్‌డ్ ఫుడ్, గ్లాస్ కంటైనర్ విభాగాల నుంచి గిరాకీ అధికంగా ఉండటంతో కంపెనీ లాభాలతో పాటు ఆదాయం కూడా గణనీయంగా పెరిగిందని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. మరోవైపు ఇన్‌పుట్ ఖర్చులు, అధిక ద్రవ్యోల్బణ పరిస్థితులు ఉన్నప్పటికీ కంపెనీ పటిష్టమైన ఎబిటా మార్జిన్‌ను కొనసాగించినట్టు ఏజీఐ గ్రీన్‌ప్యాక్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ సోమనీ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed