- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Jio: ఎయిర్‌టెల్ బాటలో జియో.. స్టార్‌లింక్‌తో ఒప్పందం

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ప్రపంచ బిలియనీర్ ఎలన్ మస్క్‌కు చెందిన అంతరిక్ష సంస్థ స్పేస్ఎక్స్‌కు చెందిన స్టార్‌లింక్‌తో ఇప్పటికే ప్రైవేట్ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. బుధవారం రిలయన్స్‌కు చెందిన జియో ప్లాట్‌ఫామ్స్ సైతం స్పేస్ఎక్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు ప్రకటించింది. దేశీయంగా శాటిలైట్ ఆధారిత టెలికాం సేవలందించేందుకు ఈ భాగస్వామ్యం పనిచేస్తుంది. కస్టమర్లకు అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సేవలందిస్తామని, అందరికీ బ్రాడ్‌బ్యాడ్ కనెక్టివిటీని అందించేందుకు ఈ ఒప్పందం కీలక అడుగు అని జియో అధికారిక ప్రకటనలో తెలిపింది. జియోకు చెందిన బ్రాడ్‌బ్యండ్ వ్యవస్థతో స్టార్‌లింక్‌ను అనుసంధానం చేయడం ద్వారా మరింత వేగంగా విస్తరణ జరుగుతుందని, ప్రధానంగా ఏఐ టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ అవసరమని జియో వివరించింది. జియో ప్లాట్‌ఫామ్‌కు చెందిన రిటైల్ స్టోర్‌లు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా స్టార్‌లింక్ సేవలు లభించనున్నాయి. జియో రిటైల్ అవుట్‌లెట్‌లలో స్టార్‌లింక్ పరికరాలను అందించడమే కాకుండా కస్టమర్ సర్వీస్ ఇన్‌స్టాలేషన్, యాక్టివేషన్‌కు అవసరమైన మెకానిజంను ఏర్పాటు చేస్తుంది. దేశవ్యాప్తంగా అన్ని ఎంటర్‌ప్రైజెస్, చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు మెరుగైన ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుందని జియో పేర్కొంది.
Also Read..