వారానికి 90 గంటలు పని.. సమర్థించిన TCS సీఈఓ

by D.Reddy |   ( Updated:2025-01-24 08:24:54.0  )
వారానికి 90 గంటలు పని.. సమర్థించిన TCS సీఈఓ
X

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా చాలా విదేశాల్లో రోజుకు 9 గంటలు, వారానికి 5 రోజులు పని పద్ధతిని పాటిస్తున్నారు. ఇక మన దేశంలో రోజూ 8 గంటలు, వారానికి 6 రోజుల వర్క్ కల్చర్ ఉంది. మన దేశంలోని పలు ఐటీ సంస్థలు విదేశీ వర్క్ విధానాన్ని పాటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల దేశంలోని యువత పని గంటలపై విస్తృతంగా చర్చ నడుస్తుంది. వారానికి 70 గంటలు పనిచేయాలని ఓ పెద్దాయన అంటే.. వారానికి 90 గంటలు పని చేయాలని ఇంకొకరు అంటున్నారు. అయితే, దేశంలోని దిగ్గజ కంపెనీల అధినేతలే ఈ విధమైన వ్యాఖ్యలు చేయటం యువతలో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తుంది.

భారతీయ యువత వారానికి 70 గంటలు పని చేయాలని, అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు కాస్తా దేశవ్యాప్తంగా పెద్ద ప్రకంపనలే సృష్టించాయి. అయితే, ఈ వివాదం ముగిసిపోకముందే.. దేశంలోని మరో దిగ్గజ సంస్థ L&T ఛైర్మన్ సుబ్రహ్మణ్యన్‌ వారానికి 70 కాదు 90 గంటలు పనిచేయాలని, ఆదివారాలు కూడా పనిచేయాలంటూ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపాయి. అంతేకాదు, ఇంట్లో కూర్చుని భార్యను ఎంత సేపు చూస్తారంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై వివిధ వర్గాల నుంచి విరమర్శలు రాగా, మరోవైపు కొందరు ఇండస్ట్రీ లీడర్లు సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు.

తాజాగా TCS సీఈవో క్రితివాసన్ కూడా ఈ అంశంపై సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలను సమర్థిస్తూ తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. పని నీతిపై సుబ్రహ్మణ్యన్ వంటి అనుభవజ్ఞుల వ్యాఖ్యల 'స్పిరిట్'ని అర్థం చేసుకోవాలని అన్నారు. సుదీర్ఘ పని గంటల సూచనలను సందర్భోచితంగా తీసుకోవద్దని, ఇక్కడ ఎన్ని గంటలు పనిచేస్తున్నామనే విషయం తక్కువ ప్రాముఖ్యతను కలిగి ఉన్న అంశంగా ఆయన పేర్కొన్నారు.

Next Story

Most Viewed