ఇలా ఈజీగా మీ PF బ్యాలెన్స్ చెక్ చేసుకోండి

by Harish |   ( Updated:2023-04-21 16:45:52.0  )
ఇలా ఈజీగా మీ PF బ్యాలెన్స్ చెక్ చేసుకోండి
X



దిశ, వెబ్‌డెస్క్: ప్రతి ఉద్యోగికి ప్రావిడెంట్ ఫండ్ ఖాతా తప్పనిసరిగా ఉంటుంది. వివిధ రకాల పరిశ్రమలు, కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసే ఉద్యోగులకు సామాజిక భద్రతా పరంగా ఉద్యోగుల భవిష్య నిధి (EPF) బాగా అవసరం. ఆర్థిక అత్యవసర సమయాల్లో PF ఖాతా నుండి డబ్బును విత్‌డ్రా చేసుకుని వాడుకోవచ్చు. అలాగే, వినియోగదారులు చేసే EPF డిపాజిట్లపై వడ్డీ కూడా లభిస్తుంది. ప్రస్తుతం 2022–2023కి EPF డిపాజిట్లపై వడ్డీ రేటు 8.15 శాతంగా ఉంది. అయితే వినియోగదారులు తమ PF ఖాతాలో ఎంత అమౌంట్ ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీనికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అవి ఏంటో ఒకసారి చూద్దాం.

1. SMS: ఖాతాకు లింక్ అయిన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి UAN నెంబర్ KYC వివరాలను 7738299899కి మెసేజ్ చేయడం ద్వారా PFలో ఉన్న బ్యాలెన్స్ గురించి తెలుసుకోవచ్చు.

2. EPFO పోర్టల్: ఈ-సేవా సైట్‌లో UAN నంబర్, పాస్‌వర్డ్‌తో epfindia.gov.inలోని లాగిన్ అయి బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.

3. మిస్డ్ కాల్: రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 9966044425 కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా UAN వెబ్‌సైట్‌లో EPFO ఖాతా వివరాలను చూసుకోవచ్చు.

4. ఉమంగ్ యాప్: ఉమంగ్ ప్లాట్‌ఫారమ్‌లోని EPFO యాప్‌ ద్వారా కూడా తెలుసుకోవచ్చు.

Also Read...

7 వేలకు పైగా 'బలెనో' మోడల్ కార్లను రీకాల్ చేసిన మారుతీ సుజుకి!

Advertisement

Next Story

Most Viewed