నదిలో పడ్డ బస్సు..

by Sumithra |
నదిలో పడ్డ బస్సు..
X

దిశ,వెబ్‌డెస్క్
రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బుండికోట నుంచి లాల్‌సోట్ వెళ్లేదారిలో ప్రయాణికులతో వెళ్తున్నబస్సు ప్రమాదవశాత్తు బ్రిడ్జి మీద నుంచి నదిలో పడిపోయింది.ఈ ప్రమాదంలో 24మంది మ‌ృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి వైద్యం అందజేస్తున్నట్టు సమాచారం. కాగా, ఆ సమయంలో బస్సులో చాలా మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. డ్రైవర్ అజాగ్రత్త వల్లే ప్రమాదం సంభవించినట్టు పలువురు చెబుతున్నారు.సమాచారం అందుకున్నపోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.ఇప్పటికి బస్సులో కొందరు ప్రయాణికులు ఇరుక్కోగా, వారిని రక్షించేందుకు స్థానికులు తమవంతు సాయం అందజేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed