తారక్, చెర్రీ ఫ్యాన్స్‌కు ఆ టెన్షనే వద్దు

by  |
తారక్, చెర్రీ ఫ్యాన్స్‌కు ఆ టెన్షనే వద్దు
X

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ మూవీలో తారక్ కొమురం భీంగా, చెర్రీ అల్లూరి సీతారామరాజుగా కనిపించబోతున్నారు. అయితే నా అన్న మన్నెం దొర అల్లూరి సీతారామరాజు అంటూ తారక్ భీం ఫర్ రామరాజు పేరిట చెర్రీ ఫస్ట్ లుక్ బర్త్ డే గిఫ్ట్ ఇవ్వగా.. తారక్ పుట్టినరోజుకు మాత్రం ఆర్ఆర్ఆర్ నుంచి ఎలాంటి కానుక అందలేదు. కరోనా కారణంగా గిఫ్ట్ ఇవ్వలేకపోయామని మూవీ యూనిట్ చెప్పింది. దీంతో తారక్ ఫ్యాన్స్ నిరాశపడ్డారు.

అయితే సినిమాలో మాత్రం ఇద్దరు కథానాయకులకు సమాన ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు రచయిత బుర్రా సాయిమాధవ్. కొమురం భీం, అల్లూరి పాత్రలను రాజమౌళి చాలా బ్యాలెన్స్‌డ్‌గా డిజైన్ చేశారని చెప్పాడు. డైలాగుల విషయంలోనూ అదే ఫాలో అయ్యామని.. పాత్రల నిడివి కూడా అలాగే ఉంటుందని చెప్పాడు. ఈ విషయంలో అటు తారక్ ఇటు చెర్రీ ఫ్యాన్స్‌కు ఎలాంటి నిరాశ ఉండదన్న ఆయన.. సినిమా అభిమానుల అంచనాలకు మించి ఉంటుందన్నారు. ఇండియన్ సినిమా హిస్టరీ మరో మెట్టు ఎక్కడం ఖాయమన్నారు బుర్రా సాయి మాధవ్.


Next Story

Most Viewed