- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘సార్.. మా గ్రామంలో బస్ షెల్టర్ నిర్మించండి’
by Shyam |

X
దిశ, గుండుమాల్: నారాయణపేట జిల్లా దామరగిద్ద మండల పరిధిలోని విఠలాపురం గ్రామానికి మెయిన్ రోడ్ పై బస్ షెల్టర్ లేకపోవడంతో ప్రయాణికులు ప్రతిరోజు నరకయాతన అనుభవిస్తున్నారు. మెయిన్ రోడ్ నుంచి విఠలాపురం గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరం ఉండటం వలన అక్కడినుంచి ప్రతిరోజు ప్రయాణికులు కాలిబాటన నడుచుకుంటూ వస్తారు. అంత దూరం నుంచి వచ్చి కాస్త సేదతీరుదాం అనుకుటే బస్ షెల్టర్ లేదంటూ ప్రజలు వాపోతున్నారు. ఎండకు వానకు చలికి ఇబ్బందులు పడుతున్నామని, సంబంధిత అధికారులు స్పందించి ఈ గ్రామానికి బస్ షెల్టర్ నిర్మించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Next Story