కన్నా… నిరూపిస్తే రేపే రాజీనామా చేస్తా: బుగ్గన సవాల్

by srinivas |   ( Updated:2020-05-01 06:09:12.0  )
Buggana Rajendranath
X

కరోనా టెస్ట్ కిట్ల కొనుగోలు ఒప్పందం కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. విపక్షాల ఆరోపణలు, ప్రభుత్వ వివరణతో రాజకీయం రక్తికడుతోంది. ఈ నేపథ్యంలో ర్యాపిడ్ టెస్ట్ కిట్లు కొనుగోలు చేసిన సంస్థకు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి డైరెక్టర్ అంటూ బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఆరోపించిన నేపథ్యంలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు.

ర్యాపిడ్ టెస్ట్ కిట్ల కొనుగోలు కంపెనీలో తాను డైరెక్టర్‌ను కాదని స్పష్టం చేశారు. కిట్ల కొనుగోలులో అవకతవకలకు పాల్పాడ్డానంటూ కన్నా చెబుతున్నారన్న ఆయన, దానిని కన్నా నిరూపిస్తే రేపు ఉదయం 9 గంటలకల్లా రాజీనామా చేస్తానని సవాలు విసిరారు.

కిట్ 730 రూపాయల చొప్పున లక్ష ర్యాపిడ్ టెస్ట్ కిట్లను దక్షిణ కొరియా నుంచి తెప్పించుకున్న ఏపీ గవర్నమెంట్.. మలి ఆర్డర్‌లో దేశంలో ఎవరికి తక్కువ ధరకి అమ్మితే అదేధరకు సప్లయ్ చేయాలన్న క్లాజుపై రెండు లక్షల ర్యాపిడ్ టెస్ట్ కిట్లకు ఆర్డర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతలతో పాటు కన్నా లక్ష్మీ నారాయణ కూడా విమర్శలు చేశారు.

tags: buggana rajendranath reddy, ap, rapid test kits, kanna laxminarayana, ysrcp, bjp



Next Story

Most Viewed