- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలి’
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పోడియం వద్దకు వెళ్లి బైఠాయించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు తీరును సీఎం జగన్ కూడా తప్పుబట్టారు. ఎందుకు అలా చేస్తున్నారో అర్థం కావాడం లేదని.. చంద్రబాబు డ్రామాలాడుతున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే మంత్రి బుగ్గన చంద్రబాబుపై చర్యలకు ప్రతిపాదించారు. చంద్రబాబు సహా టీడీపీ ఎమ్మెల్యేలపై రూల్ 77 కింద చర్యలు తీసుకోవాలంటూ సభా వ్యవహారాల మంత్రి బుగ్గన ప్రతిపాదించారు. దీనిపై స్పందించిన స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రవర్తన దారుణంగా ఉందన్నారు. ఆయన ధోరణి అసెంబ్లీ చరిత్రకే కళంకం అని చెప్పారు. సరైన సమయంలోనే చర్యల పై నిర్ణయం తీసుకుంటామని తమ్మినేని తెలిపారు.
Next Story