అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ జగన్: వెంకన్న

by srinivas |
అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ జగన్: వెంకన్న
X

ఐటీ దాడులపై చంద్రబాబు ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించే నైతిక హక్కు.. జగన్‌కు లేదని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. ఈ విషయంపై జగన్ మనసాక్షిని, సాక్షిని అడగాలని చెప్పారు. అటు విజయసాయిరెడ్డిపై ఆయన వ్యంగస్త్రాలు సంధించారు. మూడు రోజులుగా సోదాలు చేస్తున్న ఐటీ అధికారులకు ఏమీ దొరకలేదన్నారు. సమాచారం ఇచ్చిన సోంబేరి ఎక్కడా అని అధికారులు వెతుకుతున్నారని విజయసాయిరెడ్డిని ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరో నాలుగు రోజుల పాటు విజయసాయిరెడ్డి తలదాచుకోవాలన్నారు. రూ. 48 వేల కోట్ల ప్రజాధనం దోచేసిన జగన్.. అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. జగన్ అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ అని బుద్దా వెంకన్న ఆరోపణలు చేశారు. తన మీద ఉన్న కేసులపై సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ దెబ్బకి కియా సంస్థనే కాకుండా రాష్ట్రమే ఎగిరిపోయే పరిస్థితి వచ్చిందని విమర్శలు చేశారు. ఇదంతా జగన్ లెగ్‌కి ఉన్న దరిద్రం ఎఫెక్ట్ అంటూ బుద్దా వెంకన్న ట్విట్టర్ వేదికగా దూషించారు.

Advertisement

Next Story