- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డైనమైట్‌లు పేలుస్తున్న ‘డైనమైట్’
దిశ, వెబ్‌డెస్క్:
కొరియన్ పాప్ (ముద్దుగా కే-పాప్) సంగీతం ఇష్టపడేవారికి బీటీఎస్ బ్యాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొన్నటి వరకు లిరిక్ అర్థం కాకపోయినా వారి కొరియన్ పాటలు విని పాశ్చాత్య దేశాలు ఫిదా అయ్యాయి. అందుకే తమ ఇంగ్లీషు అభిమానుల కోసం ‘డైనమైట్’ పేరుతో ఒక కొత్త సింగిల్‌ను బీటీఎస్ బ్యాండ్ ఈ వారం విడుదల చేసింది. ఈ సింగిల్ విడుదలకు ముందే ప్రోమోకు చెప్పలేని ఆదరణ వచ్చింది. అప్పుడే ఇది రికార్డులను బద్ధలు కొడుతుందని మ్యూజిక్ అభిమానులు ఊహించారు. వారు ఊహించినట్లుగానే విడుదలైన తొలి వారంలోనే ఈ ‘డైనమైట్’ సింగిల్ సంగీత ప్రపంచంలో పెద్ద పెద్ద డైనమైట్‌లను పేలుస్తోంది.
బిల్‌బోర్డ్ హాట్ 100లో నెం.1 స్థానానికి చేరుకోవడం ఇక్కడ చెప్పుకోదగిన రికార్డు. ఎందుకంటే ఇప్పటిదాకా కొరియన్ ఆర్టిస్టుల పాటకు ఈ చార్ట్‌లో నెం.1 స్థానం దగ్గలేదు. గతంలో బీటీఎస్ వారి ‘ఆన్’ అనే పాట నాలుగో స్థానంలోకి చేరుకుంది. అంతకు ముందు పాపులర్ అయిన ‘గాంగ్నమ్ స్టైల్’ పాట నెం. 2 స్థానంతోనే సరిపెట్టుకుంది. కానీ మొదటిసారిగా ఈ బిల్‌బోర్డ్ జాబితాలో నెం. 1 స్థానానికి చేరుకోవడం నిజంగా ఒక గొప్ప రికార్డే. ఇక ఇతర రికార్డుల విషయానికొస్తే, విడుదలైన మొదటిరోజు యూట్యూబ్‌లో 101.1 మిలియన్ల వ్యూస్‌తో రికార్డు సృష్టించి మొదటి డైనమైట్ పేల్చింది. నిజానికి ఆ డైనమైట్ ఇప్పటికీ పేలుతూనే ఉంది. మొదటి ఐదు రోజుల్లో 200 మిలియన్ వ్యూస్ దాటిన వీడియోగా కూడా డైనమైట్ నిలిచింది. ఇక ఈ పాటకు వస్తున్న కవర్ వెర్షన్‌ల సంగతి గురించి చెప్పనక్కర్లేదు. లక్షల సంఖ్యల్లో ప్రపంచం నలుమూలల నుంచి ఈ పాటకు కవర్ వెర్షన్‌లు యూట్యూబ్‌లో అప్‌లోడ్ అవుతున్నాయి. ఇక స్పాటిఫై, యూఎస్ రేడియో వంటి మ్యూజిక్ యాప్స్‌లో కూడా ఈ డైనమైట్ సాంగ్ రికార్డులు బద్ధలు కొడుతోంది. స్పాటిఫైలో మొదటిరోజున 7.778 సార్లు ఈ పాట ప్లే అయ్యింది. ప్రముఖ హాలీవుడ్ పాప్ గాయని టేలర్ స్విఫ్ట్ పాట ‘కార్డిగన్’ రికార్డును కూడా ఇది బ్రేక్ చేసింది. కాగా, కార్డిగన్ పాట స్పాటిఫైలో 7.742 మిలియన్ సార్లు ప్లే అయ్యింది.