- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
విషాదం.. తండ్రిని దుబాయ్‌కి పంపి.. అనంతలోకాలకు తనయులు

దిశ, వెల్గటూర్: శామీర్‌పేట మండలం లాల్మలక్పేట్ (హైదరాబాద్-కరీంనగర్ రహదారి) వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం స్థంభంపల్లి గ్రామానికి చెందిన శేరి రాజేందర్ (37), శేరి సుదర్శన్ (32)లు దుర్మరణం చెందారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ముల మరణవార్త తెలియడంతో గ్రామంలో విషాదం నెలకొంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మంగళవారం తండ్రి శేరి అనంతి దుబాయ్ వెళ్తున్న క్రమంలో శేరి రాజేందర్, సుదర్శన్, వంశీలు అతడిని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సెండ్ ఆఫ్ చేసి.. కారులో ఇంటికి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో శామీర్‌పేట మండలంలోని లాల్మలక్పేట్ వద్ద ఆగి ఉన్న కంటైనర్‌ను వెనుక నుంచి ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో శేరి రాజేందర్, సుదర్శన్‌లు అక్కడికక్కడే మృతి చెందగా, వంశీ అనే యువకుడి రెండు కాళ్ళు విరిగి.. తీవ్రగాయాలయ్యాయి. కాగా శేరి సుదర్శన్ స్థంభంపల్లిలో గల విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందడంతో బాధిత కుటుంబీకులు, గ్రామస్తులు శోక సముద్రంలో మునిగిపోయారు.