లెజెండరీ క్రికెటర్ కన్నుమూత

by Anukaran |
లెజెండరీ క్రికెటర్ కన్నుమూత
X

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత డీన్ జోన్స్ గురువారం ముంబైలో గుండెపోటుతో మరణించారు. 59 ఏళ్ల జోన్స్‌కు మధ్యాహ్నం 12 గంటల సమయంలో తీవ్రమైన గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మరణించారు. ప్రస్తుతం ఐపీఎల్ 2020కి సంబంధించి స్టార్ స్పోర్ట్స్ తరపున వ్యాఖ్యానం అందించేందుకు ఆయన ఇండియాకు వచ్చారు. ముంబైలోని ఒక స్టార్ హోటల్‌లో ఏర్పాటు చేసిన బయోబబుల్‌లో జోన్స్ ఉంటున్నారు.

ఇతర కామెంటరీ బృందంతో కలసి ఆయన పని చేస్తున్నారు. భారతీయ మీడియాలో జోన్స్‌కు మంచి పేరుంది. పలు దేశాల క్రికెట్ లీగ్స్‌లో జోన్స్ వ్యాఖ్యాతగా పని చేశారు. ఎన్డీటీవీలో ప్రసారం అయిన ‘ప్రొఫెసర్ డినో’ అనే కార్యక్రమం చాలా ప్రాచుర్యం పొందింది. విక్టోరియాకు చెందిన జోన్స్ 1984 నుంచి 1992 మధ్య ఆస్ట్రేలియా తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడారు.

తన సుదీర్ఘ క్రికెట్‌ కెరీర్‌లో ఆసీస్‌ తరఫున 52 టెస్టులు, 164 వన్డేలు ఆడారు. టెస్టుల్లో 46.11 సగటుతో 3,631 పరుగులు చేశారు. అందులో 11 శతకాలు, 14 అర్ధశ తకాలు ఉన్నాయి. ఇక వన్డేల్లో 44.61 సగటుతో 6,068 రన్స్‌ చేశారు. పరిమిత ఓవర్ల క్రికెట్లో 7 శతకాలు, 46 అర్థ శతకాలు సాధించారు.

Advertisement

Next Story

Most Viewed