- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తండ్రిపై పోరాటంలో బ్రిట్నీ స్పియర్స్‌కు ఊరట..
దిశ, సినిమా: పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ తండ్రి సంరక్షణ బాధ్యతల నుంచి తప్పించాలనే న్యాయ పోరాటంలో గెలుపు సాధించింది. సుమారు మూడువారాల తర్వాత బుధవారం(జులై14న) జరిగిన వాదనల టైంలో లాస్ ఏంజెల్స్ కోర్టుకు ఫోన్ కాల్ ద్వారా విచారణకు హాజరైన బ్రిట్నీకి.. తన లాయర్(అటార్నీ)ను తానే నిర్ణయించుకునే హక్కు ఆమెకు ఉందని కోర్టు వెల్లడించింది. స్పియర్స్ తరుపున ఇంతకు ముందు అటార్నీ రాజీనామాను ఆమోదిస్తూనే, కొత్త అటార్నీ మాథ్యూ రోసెన్‌గార్ట్‌ను నియమించుకునే హక్కును బ్రిట్నీకి కల్పిస్తున్నట్లు తీర్పు ఇచ్చారు. ఇక గార్డియన్‌షిప్ నుంచి తన తండ్రిని తప్పించాలని.. ‘నన్ను చంపే ప్రయత్నం జరుగుతోందని, ఆయన వ్యవహారశైలి క్రూరంగా ఉందని, కనీసం వాదనల కోసమైన తనకు స్వేచ్ఛను ప్రసాదించాలని ఆమె న్యాయమూర్తికి విజ్ఞప్తి చేసుకోవడంతో స్పందించిన జడ్జి బ్రెండా పెన్నీ ఈ తీర్పు వెల్లడించారు. కాగా ఆమెకు మద్దతుగా భారీ ఎత్తున ఫ్రీబిట్నీ ‘#FreeBritney’ సైన్ పిటిషన్‌ను రన్ చేస్తూ.. లక్షల మంది సంతకాలు చేపడుతున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే మేనేజర్ లారీ తప్పుకోవడంతో 39 ఏళ్ల బ్రిట్నీ.. తన కెరీర్‌కు గుడ్‌బై చెప్పబోతోందంటూ సమాచారం.