ఆసుపత్రిలో చేరిన బ్రిటన్ ప్రధాని బోరిస్

by vinod kumar |   ( Updated:2020-04-05 23:47:01.0  )
ఆసుపత్రిలో చేరిన బ్రిటన్ ప్రధాని బోరిస్
X

హోం క్వారంటైన్‌లో ఉన్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌ను ఆసుపత్రికి తరలించారు. కరోనా వైరస్‌తో బాధపడుతున్న ఆయన పది రోజుల నుంచి హోం క్వారంటైన్‌లో ఉన్నారు. అయినప్పటికీ బోరిస్ ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఆసుపత్రికి తరలించినట్టు డౌనింగ్ స్ట్రీట్ అధికారులు తెలిపారు. గత పదిరోజులుగా ప్రధాని బోరిస్ ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉండి కరోనా వ్యాప్తిపై సమీక్షిస్తూ వీడియో మెసేజ్‌లు విడుదల చేశారు. కాగా, బ్రిటన్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటి వరకు 48 వేల మందికి సోకగా, 4,934 మంది బాధితులు మృతి చెందారు.

Tags: britan pm, bories, carona, hospital

Advertisement

Next Story