‘మేడ్ ఇన్ ఇండియా’ సైకిల్ తొక్కిన బ్రిటన్ ప్రధాని..

by  |
‘మేడ్ ఇన్ ఇండియా’ సైకిల్ తొక్కిన బ్రిటన్ ప్రధాని..
X

దిశ, వెబ్‌డెస్క్ :
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సైకిల్ తొక్కారు. అందులో ఆశ్చర్యం ఎముంది అంటారా.. ఆయన రైడ్ చేసింది మేడ్ ఇన్ ఇండియా సైకిల్ మీద. కొవిడ్-19ను ఎదుర్కొనేందుకు స్థూల కాయాం (ఒబెసిటీ)కి వ్యతిరేకంగా అక్కడి ప్రభుత్వం చేపట్టిన ఓ ప్రోగ్రాంలో భాగంగా ఆయన సైకిల్ తొక్కారు. 56 ఏళ్ళ జాన్సన్‌కు సైక్లింగ్ అంటే ఎంతో ఇష్టమని తెలసింది. హెల్త్, ఫిట్ నెస్ కోసం సైక్లింగ్ చాలా మంచిదని బ్రిటన్ ప్రధాని చెబుతున్నారు.

కరోనా వైరస్ కారణంగా మృతి చెందుతున్నవారిలో చాలా మంది స్థూల కాయులేనని, మితిమీరిన శరీర బరువు వల్ల వారు చనిపోతున్నారని బ్రిటన్‌లో కొందరు నిపుణులు ఇటీవల తేల్చారు. దీంతో మెల్లగా ఒబెసిటీ వ్యతిరేక ప్రచారోద్యమం ప్రారంభమైంది .సైక్లింగ్, వాకింగ్ వంటి వాటివల్ల కరోనాను ఎదుర్కోవచ్ఛునని వైరస్ బారి నుంచి బయటపడిన బోరిస్ జాన్సన్ అంటున్నారు. బ్రిటన్‌లో హీరో మోటార్స్ కంపెనీ సైకిళ్లను ఉత్పత్తి చేస్తోంది. అయితే, అవి అక్కడి ప్రజలకు అనువైన, వారు కోరుతున్న డిజైన్లతో తయారు చేస్తున్నారు.


Next Story

Most Viewed