యూపీలో బ్రిటన్ ఆయుధ కంపెనీ యూనిట్..

by  |
యూపీలో బ్రిటన్ ఆయుధ కంపెనీ యూనిట్..
X

దిశ, వెబ్‌డెస్క్ :

యూపీలో పారిశ్రామిక రంగాన్ని మరింత పటిష్ట చేసేందుకు యోగి సర్కారు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగానే పారిశ్రామిక వర్గాలకు రాయితీలు ప్రకటిస్తోంది. కంపెనీ నెలకొల్పే వారికి సెక్యూరిటీతో పాటు అన్ని అనుమతులను అనతి కాలంలోనే మంజూరు చేస్తుంది. ఈనేపథ్యంలోనే యూపీకి ప్రతిష్టాత్మక కంపెనీలు క్యూ కడుతున్నాయి. తాజాగా ప్రముఖ బ్రిటిష్ ఆయుధాల తయారీ కంపెనీ ‘వెబ్లీ అండ్ స్కాట్’ (డబ్ల్యూ అండ్ ఎస్) త్వరలో ఓ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ప్రభుత్వం అమలు చేస్తున్న ‘మేక్ ఇన్ ఇండియా’ పథకంలో భాగంగా దీనిని ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.

‘వెబ్లీ అండ్ స్కాట్ యూనిట్’ యూపీలోని హర్దోయి జిల్లా శాండిలలో ఏర్పాటు కానుంది. ఇది నవంబర్ నుంచి కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఓ విదేశీ కంపెనీ భారత్‌లో ఆయుధాలను తయారు చేయడం ఇదే మొదటిసారి.

రెండు ప్రపంచ యుద్ధాల్లోనూ మిత్రపక్ష కూటమి దళాలకు ఆయుధాలను సరఫరా చేసిన ఘనత వెబ్లీ అండ్ స్కాట్ కంపెనీకే దక్కుతుంది.దాదాపు 15 దేశాలకు ఈ కంపెనీ తమ ఆయుధాలను సరఫరా చేస్తోంది. సియాల్ మాన్యుఫ్యాక్చరర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఈ యూనిట్‌ను వెబ్లీ అండ్ స్కాట్ ఏర్పాటు చేయనుంది. మొదట రివాల్వర్ల తయారీతో ఈ కంపెనీ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. తొలి దశలో 32 రివాల్వర్లను తయారు చేయనున్నారు.

సియాల్ మాన్యుఫ్యాక్చరర్స్ ప్రతినిథి జోగీందర్ పాల్ సింగ్ సియాల్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ సహకారం, కేంద్ర ప్రభుత్వపు ‘మేక్ ఇన్ ఇండియా’ విధానం తమ ప్రాజెక్టు ఖరారు కావడానికి దోహదపడినట్లు వివరించారు.


Next Story

Most Viewed